తెలుగు లిపి

బ్లాగ్ # 35; 08.06.17 - మన జీవనయాత్రలో సదా మార్గదర్శకుడైన ప్రభువు

బ్లాగ్ # 35; 08.06.17 – మన జీవనయాత్రలో సదా మార్గదర్శకుడైన ప్రభువు
భక్తుడు  గుణమయ్ ముఖోపాధ్యాయ చేసిన కథనం ఇది.

శ్రీ గుణమయ్ ముఖోపాధ్యాయ నుండి విన్నదానిని తిలక్ ఘోషాల్ అలాగే తెలిపాడు. నా లాగే నా తాతయ్య  శ్రీ కులద ప్రసాద్ బన్ద్యోపాద్యాయ కూడ రైల్వే ఉద్యోగి. ఆయన సోనాముఖి రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టరుగా పనిచేసి, రిటైర్ అయ్యారు. ఆయన తమ్ముని భార్య కుసుమతల్లికి మేనకోడలు అవుతుంది.  ఆ విధంగా ప్రభువు, నా తాతయ్య మధ్య బాంధవ్యం సాగింది. నా తాతయ్య సోనాముఖి రైల్వే స్టేషన్ లో పని చేస్తున్నపుడు ప్రభువు  ఊరిలో ఉంటే తప్పక దాదాపు ప్రతిరోజు సాయంత్రం స్టేషన్ కు వెళ్ళి ఆయనతో, అక్కడి ఉద్యోగస్థులతో బాతాఖానీ చేసేవాడు. నా తాతయ్య లాగే వారూ ఆయన్ని ప్రభూ (థాకూర్) అని పిలిచేవారు. ప్రభువు బాగా ముస్తాబు చెసుకుని వచ్చేవారు కాబట్టి ఆయన ఆధ్యాత్మిక పురుషుడా, లేక శ్రీమంతుడా అని అన్యులు గుర్తించటం కష్టంగా ఉండేది.

అక్కడి ఉద్యోగులలో ఒకడైన నిబారన్, ప్రభువు రావటం గమనించగానే ఒక కుర్చీని తెచ్చి స్టేషన్ లో ఉన్న చేపచెట్టు క్రింద అమర్చే వాడు.  నా తాతయ్య రైల్వే స్టేషన్ ప్రక్కనున్న రైల్వే క్వార్టర్స్ లో నివసించే వారు. ఆ కాలంలో బ్రూక్ బాండ్ కంపెనీ యొక్క కొట్టు సోనాముఖిలో ఉండేది. ఆ కంపెనీ ఏజెంట్ ప్రతినెలా నా తాతయ్యకు మేలైన “టీ” ని పంపించేవాడు.  ఆ “టీ” అంటే ప్రభువుకు మిక్కిలి ప్రియము. అందువల్ల ప్రభువు వచ్చి కూర్చోగానే నా బామ్మ “టీ” తయారు చేసి, బిస్కెట్లతో చేర్చి ఆయనకు పంపించేది. దానిని సేవిస్తూ ప్రభువు బాతాఖానీ, పరిహాసాలకు దిగేవాడు.

అది ఆషాఢమాసంలో ఒకరోజు. వర్షాకాలం ప్రారంభ మయింది. నా తాతయ్యకు స్వగ్రామం ఇచ్ఛారియా నుండి వార్త అందింది, అక్కడి తన భూముల సమస్యను పరిష్కరించటానికి ఆయన అక్కడికి సత్వరం రావాలని. అప్పటి బ్రిటీషు పరిపాలనలో రైల్వో ఉద్యోగికి, వారాంతంలో అర్హమైన శెలవు దొరకటమే విశేషం, 2, 3 రోజుల శెలవు దొరకటం సాధ్యమా? నా తాతయ్య తన మీది అధికారియైన బోస్ బాబును అశ్రయించారు. ఎంతో వేడుకున్న తరువాత, మరుసటి రోజు మధ్యాహ్నం బండికి ఆయనకు బదులుగా ఒక ఆఫీసరును పంపిస్తారనీ, అయనకు తన పనిని అప్పగించి ఆయన వెళ్ళవచ్చనీ, అయితే మరుసటిరోజు తిరిగి పనికి హజరు కావాలనీ, ఎందుకంటె ఆఫీసరు తిరిగి సాయంత్రం బండికి తిరిగి వెళ్ళిపోవాలనీ చెప్పారు. పనిని అప్పగించకుండా తాతయ్య వెళ్ళడానికి లేదు. అధికారి బోస్ కు బాబు ఖచ్చింతంగా చేప్పేశాడు, తారుమారు జరిగితే ఆయన మీద కఠినచర్య తీసుకోవలసి వస్తుందని. ఇచ్ఛారియా చాల దూరంలో ఉంది, ఎద్దుబండ్ల మీద వెళ్ళవలసి ఉంది. అందులో వర్షాకాలంలో ప్రయాణం సాగించటం. కాని గత్యంతరం ఏమిటి?

ఆ రోజు సాయంత్రం మామూలుగా ప్రభువు స్టేషనుకు వచ్చారు. తాతయ్య ఇంటి ముందు ఎడ్లబండి నిలబడి ఉండటం చూసి ఆయన అడిగారు, “కులద! బండి ఎందుకు వచ్చింది? వెళ్ళుతున్నది ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు?”  అని. తాతయ్య బయటికి వచ్చి దీనంగా బదులు చెప్పారు, “ఏమి చెప్పను ప్రభూ! నేను అత్యవసర పనిమీద ఇచ్ఛారియాకు వెళ్ళవలసి వచ్చింది.” ఫ్రభువు అడిగారు, “అయితే వర్షసమయంలో ఇంత ఆలస్యంగా ఎందుకు బయలుదేరుతున్నారు?” తాతయ్య బదులు చెప్పారు, “నేనేం చేసేది ప్రభూ! నన్ను విడుదల చేసే ఆఫీసరు ఇప్పుడే వచ్చాడు. నేను పనిని ఆయనకు అప్పగించి కాని వెళ్ళలేను.  ఇచ్ఛారియాలో పని చాల అవసరమైనది. నేను వెళ్ళక తప్పదు. సరే, మీరు కూర్చొని ఇతరులతో బాతాఖానీ చేయండి. మీ టీ వస్తున్నది, నేను త్వరగా వెళ్ళాలి,” అని. ప్రభువు దీర్ఘంగా ఆలోచించారు, తుదకు చెప్పారు, “తప్పదు అంటే సరే వెళ్ళు. అయితే దారి పొడవునా కష్టాలు ఎదురవుతవి. ”
అరణ్య మధ్యంలోకి ప్రవేశించగానే, మేఘాలు క్రమ్ముకున్నాయి, పెద్దవర్షం ప్రారంభమయింది. దారి కనిపించటం లేదు, ముందుకు సాగటం దుర్గమమయింది. తాతయ్య “నారాయణ్, నారాయణ్, నారాయణ్” అని మాకులదైవమయిన సత్యనారాయణ నామం పలుకుతూ ఉన్నారు. అయితే ప్రభువు యొక్క నామం ఒక్క సారి అయినా పలుకలేదు. అకస్మాత్తుగా ఒక కుక్క కనిపించింది. తాతయ్య బండివాణ్ణి అడిగారు, బొరుగులు ఉన్నాయా అని. అతడు ఉన్నాయని చెప్పాడు. తాతయ్య అన్నారు, దానిని పిలిచి బొరుగులు పెట్టమని. కుక్క పరిగెత్తుకొని వచ్చింది, బొరుగులను వాసన చూసింది, ముందుకు సాగింది. తాతయ్యకు ఏదో స్ఫురించింది, ఆ కుక్కను అంటిపెట్టుకొని ముందుకు సాగమని బండివానితో చెప్పారు. అప్పుడప్పుడు కుక్కను పిలుస్తూనే ఉండినారు. ఆవిధంగా వారు పంచాల్ చేరుకున్నారు. అప్పటికి వర్షం కూడ తెరపి ఇచ్చింది, బాట తెలిసింది. తరువాతి ప్రయాణం సాఫీగానే సాగింది. చివరికి రాత్రికి ఇచ్ఛారియా చేరుకున్నారు.

ఇచ్ఛారియాలో తన పనిని త్వరగా ముగించుకొని, తాతయ్య మరుసటి రోజు ప్రొద్దుటే సోనాముఖికి తిరుగు ప్రయాణం చేపట్టారు. సకాలంలో సోనాముఖి చేరుకొని వచ్చిన ఆఫీసరుని త్రిప్పి పంపించి వేశారు. ఆ రోజు మధ్యాహ్నం ఎప్పటిలాగే ప్రభువు రైల్వే స్టేషన్ కు వచ్చారు. తాతయ్య ఇంటి దగ్గరికి రాగానే పిలిచారు, “ఓ కులద! తిరిగి వచ్చేశావా? ” తాతయ్య బయటికి వచ్చి బదులు చెప్పారు, “అవును ప్రభూ! ఇప్పుడే వచ్చాను. దారిలో చాల కష్టం కలిగింది.” ప్రభువు ఆయన వైపు ఓరగా చూసి అన్నారు, “కులద ఏమంటున్నావు? నీవు హాయిగా బండిలో కూర్చున్నావు కదా, నేను భారి వర్షంలో నడువ వలసి వచ్చింది. తమషాగా ఉందే, నీకు కష్టం కలిగిందనా అంటున్నావు!”  తాతయ్యకు ఏమీ బోధ పడలేదు, అన్నారు, “మీరు బాగా తడిసి పోయారా, నా కేమీ బోధపడటం లేదు,” అని. ప్రభువు నవ్వి అన్నారు, “అయితే చెప్పు, ఆ భారి వర్షంలో నీ బండి ముందు నడిచి నీకు దారిచూపించిందెవరు? నీ నారాయణుడు నీకు సాయపడ్డాడా?” తాతయ్య చీకటినుండి బయటపడ్డారు, అశ్రువులు నిండిన కళ్ళతో ప్రభువు పాదాల మీద పడి అన్నారు, “ఓ ప్రభూ! నీ లీలలెవరు తెలుసుకోగలరు.” ప్రభువు ఆయన్ని లేవనెత్తి కౌగిలించుకున్నారు.

బ్లాగ్ 34; 18.04.2017 - "పితలాటకమైన ప్రశ్నకు జవాబు దొరికింది రచయిత్రి": బిష్ణుప్రియ బిస్వాస్, బర్దమాన్

బ్లాగ్  34; 18.04.2017
“పితలాటకమైన ప్రశ్నకు జవాబు దొరికింది  రచయిత్రి : బిష్ణుప్రియ బిస్వాస్, బర్దమాన్ కూర్పు : తిలక్ ఘోశాల్
(Telugu translation: Sri Haragopal Sepuri) 

జుగళ ప్రభువైన కుసుమహరనాథుని మనవడి భార్య శ్రీమతి ధీర బెనర్జీ, నా అక్కయ్య. నా వివాహానంతరం నేను అనేక మార్లు సోనాముఖికి వెళ్ళాను, అది నాలో ప్రభువు, మాతాజీల మీద గాఢమైన ఆకర్షణ ఏర్పడడానికి కారణభూతమయింది. ఉత్సవాల సమయాలలో, సందర్భాలలో కాకపోయినప్పటికీ, నాకు వీలైనపుడల్లా వెళ్ళి శ్రీమందిర్ ను, తోటను దర్శించుకునే దానిని. అయితే నేను 2015లో, ప్రభుని 150వ జన్మదిన సందర్భంగా జరిగిన ఉత్సవాలకు హాజరయ్యాను. అప్పటి ఒక సందర్భాన్ని అందరితో పంచుకో దలిచాను. ఆ సందర్భంలో రెండు పత్రికలను ప్రచురించారు. అందులో ఒక పత్రికలో, నా అక్కయ్య వ్రాసిన “ప్రభువుకు ప్రీతికరమైన వస్తువులు,”  
అనే బెంగాలీ వ్యాసం ప్రచురింపబడింది. అక్కయ్య ఎంతో శ్రమతో ప్రభువుకు ప్రీతికరమైనవి ఏవిటని శోధన చేసి సేకరించింది. ఉత్సవం చివరి రోజు అక్కయ్య, నేను ఆమె ఇంట్లో (స్నేహలత) కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, ఎవరో వచ్చి కేక పెట్టారు, “ఇది ధీరా దేవి గారి ఇల్లా?” అని. సోనాముఖిలో ఎవ్వరూ ఆమెను ధీరా దేవి అని సంబోధించి పిలువరు. మేము కుతూహలంతో బయిటికి వచ్చాము. ఒక వృద్ధుడు గేటు వద్ద నిలుచున్నాడు.  అక్కయ్య తనను పరిచయం చేసుకోగానే, ఆయన అన్నారు, “నా పేరు గునిరాం ముఖోపాధ్యాయ, నేను మీరు వ్రాసిన వ్యాసాన్ని చదివాను. ముప్పై సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్న ఒక సందిగ్ధాన్ని మీ వ్యాసం మాపుచేసింది.  మీకు నా కృతజ్ఞతను తెలుపుకొనడానికి వచ్చాను.  నేను లోనికి రావచ్చా?” ఆయన లోనికి వచ్చారు, మా ఆశ్చర్యాలను చూసి నవ్వుతూ, నేను మీకు వివరిస్తాను అని తన జీవతంలో సంభవించిన ఒక అతిశయ సంఘటనను క్రింది విధంగా మాకు తెలియ జేశారు. ఆ కాలంలో గునిరాం బాబు సోనాముఖిలో రైల్యే స్టేషన్ మాస్టరుగా పనిచేస్తూ ఉండే వారు.

సోనాముఖి ఒక చిన్న స్టేషన్, రోజూ కొన్ని మాత్రం రైలు బండ్లు పరిగెడుతుండేవి. పనివాండ్లు కూడ తక్కువే. తరచు ఉద్యోగస్తులు శెలవులు పెట్టేవారు. కాబట్టి గునిరాం బాబు రైల్వే స్టేషన్ కు సంబంధించిన పనుల నన్నింటినీ తానే నిర్వహించవలసి వచ్చేది. డిసెంబర్ 31వ తేది అలాటి దుర్దశ రోజు, ఆయనకు ఊపిరి సలుపనంత పని – ప్లాటుఫారం పని, సిగ్నల్ రూం పని, గేటు వద్ద పని, ఆఫీస్ రూం పని. ప్రొద్దుటి నుండి తిండి లేదు, ఇంటికి వెళ్ళి గబగబ ఏదైనా తినడానికి తీరిక దొరకలేదు. ఇంతలో ఒర రైలు వచ్చి ఆగింది. ఆయన టికెట్లు తనిఖీ చేస్తుండగా, ఒక పెద్దమనిషి, తెల్లటి ధోవతి, జుబ్బా ధరించి ఉన్నాడు, తెల్లటి గడ్డం మీసాలు ఉన్నాయి, బండి దిగివచ్చి గునిరాం బాబుకు తన టికెట్టును ఇచ్చి అన్నాడు, “మీరు బాగా ఆకలి గొని ఉన్నట్లుంది, దగ్గరలో హరనాథ మందిరం ఉంది, ఈ రోజు అక్కడు వారు ఆనంద మిళన్ ఉత్సవం చేసుకుంటున్నారు. అందరికీ భోజనం పెడతారు. నేను అక్కడికే వెళ్ళుతున్నాను. మీరు కూడ రాకూడదూ?” అని అన్నాడు. గునిరాం బాబుకు భోజనం ప్రసక్తి వినగానే, నోటిలో నీళ్ళూరాయి, కాని ఏమి చేయటం, ఆయన అక్కడినుండి కదలడానికి లేదు. కొంత సేపటి తరువాత అదే వ్యక్తి ఒక ఆకులో భోజన పదార్థాలను ఉంచి, వాటిని మరొక ఆకుతో కప్పి తీసుకొని వచ్చి గునిరాంకు ఇచ్చి అన్నాడు, “మీరు రాలేక పోయారు,అందుకని నేనే భోజనం పట్టుకొని వచ్చాను, తీసుకోండి అని.” గునిరాం చకితుడయ్యాడు, ఇలా ఒక అపరిచిత వ్యక్తి దయతో తనకు భోజనం తీసుకొని రావటం చూసి. ఆ వ్య

బ్లాగ్ పోష్టు # 33; 12.04.2017 - "శాశ్వత రక్షకుడు, బోధకుడు అయిన ప్రభువరచయిత్రి" : చందన కాన ఘోషాల్, కొల్ కొతా

బ్లాగ్ పోష్టు # 33; 12.04.2017

శాశ్వత రక్షకుడు, బోధకుడు అయిన ప్రభువరచయిత్రి : చందన  కాన ఘోషాల్, కొల్ కొతా

కూర్పు ; తిలక్ ఘోషాల్

(Telugu translation: Sri Haragopal Sepuri)

మన శాశ్వత రక్షకుడు – తాతయ్య ప్రభుహరనాథుని మనవరాలిగా, (శ్రీ కృష్ణదాస్ బెనర్జీ యొక్క కుమార్తెగా) ప్రభువు యొక్క మహాభక్తుడైన శ్రీ శిశిర్ కుమార్ ఘోషాల్ యొక్క కోడలిగా సంభవించటం అది నా మహాభాగ్యం. నా భర్త శ్రీ సనత్ కుమార్ ఘోషాల్ కుసుమహరనాధుని పాదపద్మాలను చేరుకొని రెండు సంవత్సరాలు గతించాయి. ప్రభుని రెండు దశలను గురించి నేను అనుభవించినది, నా భర్త అత్తయ్యల నుండి నేరుగా విన్నది, భక్తులతో పంచుకొనటానికి నిర్ణయించుకున్నాను – ఒకటి, ఆయన మన ప్రాపంచిక జీవితంలో శాశ్వత రక్షకుడు, రెండవది ఆచార్యుడుగా ఆయన అద్వితీయుడు. ఆయన శాశ్వత రక్షకుడని కీర్తిశేషులైన నా భర్త జీవతంలోని

రెండు సంఘటనలు:

మొదటి సంఘటన మా వివాహానికి పూర్వం సంభవించింది. దానిని నా భావి భర్త నా తండ్రికి (అంటె తన భావి మామగారికి) పోస్టుకార్డు ద్వారా తెలిపారు. అప్పుడు ఆయన గౌహాటీలో ఉద్యోగం చేస్తుండే వారు. ఒకరోజు ఆయన బ్రహ్మపుత్రా నదిని దాటి టీ తోటను తనిఖీ చేయడానికి వెళ్ళవలసి వచ్చింది. తన పనిని ముగించుకొని ఆయన పడవలో తిరిగి వస్తుండగా నదీమధ్యంలో పడవ తిరుగబడింది. ఆయన సంచి, వస్తువులు మాత్రమే కాదు, ఆయన చొక్కా కూడ ప్రవాహ ఉరవడిలో కొట్టుకొని పోయాయి. ఆయన తీరం వైపుకు ఈద సాగారు, అయితే ఉరవడి వల్ల మందంగా సాగగలిగారు. మెల్లగా ఆయనకు అలసట కలగటం సంభవించింది. తీరం దగ్గరలోనే ఉన్నప్పటికీ, అంగాలు ప్రతిఘటించాయి. ఆశను వదలుకున్న ఆ సమయంలో ఆయనకు వెనకనుండి ఒక తోపుడు కలిగింది, మెల్లగా తీరం చేరుకున్నారు. ఆ ఆపద సమయంలో ఆయన్ని సురక్షితానికి చేర్పించిన వారెవరు?

రెండవ సంఘటన మా వివాహానంతరం సంభవించింది. అప్పుడు మేము అస్సాం లోని రంగియా అనే చోట బసచేస్తున్నాం. ఆయన ఆఫీసు విషయంగా తరచు ప్రయాణం చేయ వలసి వచ్చేది. ఆరోజు వేరే గ్రామంలో తనిఖీ చేయటం కొరకు రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. కారణమేమిటో తెలియదు కాని ఆయన ముందు స్టేషనులోనే తన సామానుతో పాటు దిగిపోయారు. అక్కడినుండి ఏదో విధంగా గమ్యాన్ని చేరుకున్నారు. ఆ తరువాత ఆయనకు వార్త అందింది, తాను ప్రయాణం చేసిన రైలు తాను దిగిన కొంత దూరంలో ప్రమాదానికి గురి అయిందనీ, చాలా మంది గాయపడ్డారనీ, మరణించారనీ. ఆయన గమ్యానికి ముందు స్టేషనులోనే దిగిపోవటాన్ని పురికొల్పినదెవరు?

మహోన్నత ఆచార్యుడైన తాతయ్య

ఈ కథను నా అత్తయ్యనుండి విన్నాను. ఒకసారి ప్రభువు కలకత్తాకు వచ్చారు, ఒక భక్తుని ఇంట్లో బస చేశారు, ఆ భక్తుడెవరో నాకు గుర్తు రావటం లేదు. నా మామయ్య గారు నిత్యం ఆ ఇంటికి వెళ్ళేవారు, ప్రభువు యొక్క, సహభక్తుల యొక్క సాంగత్యం కొరకు. ఒకరోజు హఠాత్తుగా ప్రభువు నా మామయ్యగారితో అన్నారు, “రేపు నేను నీ ఇంటికి వస్తాను, నా తల్లి వండిన ఆహారాన్ని భుజించటానికి, “ అని. నా మామయ్య గారు ఆనందం పట్టలేక పోయారు, ఇంటికి పరుగెట్టారు, ఈ వార్తను తెలుపటానికి. ఇల్లు ఆనందంతో నిండి పోయింది. మరుసటి రోజు ఉదయం మామయ్యగారే స్వయంగా బజారుకు వెళ్ళారు, సంచినిండుగా కూరగాయలు కొని తీసుకొని వచ్చి ఇంట్లో ఖచ్చితంగా చెప్పారు, అన్నింటినీ వండాలనీ, వేటినీ వదిలి వేయకూడదనీ. ప్రభువు కొందరు భక్తులతో కలిసి సమయానికి వచ్చారు. అత్తయ్య భోజనం సిద్ధం చేసే వరకు కబుర్లు పరిహాసాలు సాగాయి. ప్రభువు భక్తులతో కలిసి గంగాస్నానానికి వెళ్ళారు. గంగాతీరం భవానీపూర్, బకుల్ బాగన్ రోడ్డులో ఉన్న ఇంటికి దగ్గరలోనే ఉంది. ఒక గంట గతించింది, ప్రభువు తిరిగి రావలసిన సమయం, అయితే ఆయన జాడే లేదు. ఇంతలో ఒక బ్రాహ్మడు వచ్చి ద్వారంవద్ద కేకపెట్టాడు, “అమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా,” అని. అందరూ సందిగ్ధంలో పడిపోయారు, ఏమి చేయాలో తోచలేదు. ప్రభువు కొరకు వండిన పదార్థాలను ఆయన ఆరగించాటానికి మునుపే ఎలా మరొకరికి  ఇవ్వటం అని. మామయ్యగారు ఆయన్ని కూర్చోమని చెప్పారు, కొంత ఆగమని అన్నారు. ప్రభువు వస్తున్నారా లేదా అని ఇంటిలోకి బయటికీ గాబరాగా పచార్లు చేయసాగారు. అయితే ప్రభువు వస్తున్న జాడే లేదు. సరేనని బ్రాహ్మడికి భోజనం వడ్డించమని నా అత్తయ్యతో చెప్పారు. బ్రాహ్మడు భోజనం చేయటం ప్రారంభించాడో లేదో ప్రభువు తన పరివారంతో సరదాగా ఆనందంగా భాషించుకొంటూ వచ్చారు. నా అత్తయ్యను చూసి అన్నారు, “అమ్మా మేమందరం మిక్కిలి ఆకలిగా ఉన్నాం, నీవు వండిన మధుర పదార్థాలను మాకు వడ్డించు,” అని. తృప్తిగా భోజనం చేస్తూ, మరి మరి వడ్డించమని అడుగుతూ, పదార్థాలను ప్రశంసించారు. ఈ సంఘటన మూలంగా ప్రభువు ”దరిద్ర నారాయణ సేవ” యొక్క విశిష్టతను మాకు బోధించారు. కుసుమమ్మ ఆ బోధనను కొనసాగించింది. నేను స్వయంగా చూశాను, ఆనంద మిళన్ ఉత్సవ సందర్భాలలో ఆమె దరిద్ర నారాయణ సేవ ముగిసేటంతటి వరకు నోటిలో ముద్దను పెట్టుకునేది కాదు. ఆ తరువాత విస్తర్లలో మిగిలిపోయిన కొన్ని మెతుకులను ప్రసాదంగా ఆరగించిన తరువాతే భోజనం చేసేది.

బ్లాగ్ పోస్ట్ # 32; 29.03.2017 - శ్రీమతి ఎ.జయలక్ష్మిగారి ఒక అనుభవం

బ్లాగ్ పోస్ట్ # 32; 29.03.2017

శ్రీమతి .జయలక్ష్మిగారి ఒక అనుభవం

(హరగోపాల్ సేపూరి కి తెలిపిన విషయం)

 

సోనాముఖిలోని మూర్తులు సజీవ మూర్తులు

సోనాముఖిలోని మాతా ప్రభువుల మూర్తులు సజీవ మూర్తులు. దీనిని ఒక అనుభవం ద్వారా రూఢిగా తెలుసుకో గలిగాను. అది 2003 దశరా సందర్భంగా సాగుతున్న సప్తాహం సన్నివేశం. శ్రీ నండూరి వెంకటేశ్వర రావు, నండూరి కుసుమాంబ, నండూరి సంపత్ కుమార్, నండూరి రమణి, ఇందిరా ఆమె చిన్ని కుమారుడు చైతన్య, వీరితో కలిసి నేను సోనాముఖికి ఐదు రోజులు ముందుగా వెళ్ళాము. అప్పటినుండి మా సత్సంగం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు సాయంత్రం అమ్మమూర్తికి ప్రక్కగా నున్న కిటికీ గడప మీద కూర్చొని నేను నామం చేసుకుంటున్నాను. ఆకస్మాత్తుగా నాకు ఒంటి నిండా చీమలు ప్రాకినట్లు దురద ప్రారంభమయింది. నేను జాగ్రత్తగా పరిశీలించాను, ఎక్కడా చీమలు కనిపించలేదు. కొంత సేపటి తరువాత నేను బాబా మూర్తి ప్రక్కగా వెళ్ళి కూర్చున్నాను. బాబా కుర్తా, ధోవతి నిండుగా చీమలు ప్రాకటం చూశాను. వెంటనే అమ్మ ప్రక్కన కూర్చొని నామం చేసుకుంటున్న కుసుమాంబ గారిని పిలిచి చూపించాను.

     అమ్మ బాబా మూర్తలు సజీవ మూర్తులని అర్థం చేసుకున్నాను.

 

ఆందోళన చెందిన మనస్సునకు ఉపశమనం

నా భర్త మిక్కిలి అనారోగ్యంతో ఉండగా నేను ఆయనకు సేవచేసే దానిని, ఆ సేవ ప్రభువు నాకు అనుగ్రహించిన భాగ్యమని తలుచుకుంటూ. అది నా ధర్మమని కూడ నాకు తెలుసు. అయితే లోలోపల నాకు ఒక సందేహం వేధిస్తూ ఉండింది. ఈ సేవ వల్ల ప్రభుపు యొక్క సేవను సరిగా చేయలేక పోతున్నానని. ఒక రాత్రి నాకు కుసుమమ్మ కలలో కనిపించి నాతో చెప్పింది, నేను చేసే రెండు సేవలూ సక్రమంగానే ఉన్నాయనీ, ఇక నేను అదనంగా చేయవలసింది ఏమీలేదనీ. అలా చెప్పి నన్ను తనవైపుకు లోక్కొని లలాటాన్ని ముద్దు పెట్టుకుంది. దానితో నన్ను వేధిస్తున్న సమస్య మటుమాయమయింది. తరువాత అమ్మ పడుకుంది, నేను ఆమె పాదాలు ఒత్తటం ప్రారంభించాను. ప్రభువు నాకు సమక్షంలో కనిపించకపోయినప్పటికీ, ఆయన సమక్షంలోనే ఉన్నాడని నాకు ఆనవాళ్ళు తెలిసేవి, ఒక వెలుగు లాగో, వాతావరణం సువాసనలతో నిండి పోయేది.

బ్లాగ్ # 31; 17.03.2017 - శ్రీమతి ఎ.జయలక్ష్మిగారి ఒక అనుభవం

కుసుమహరబ్లాగ్ # 31; 17.03.2017

శ్రీమతి.జయలక్ష్మిగారిఒకఅనుభవం

(హరగోపాల్సేపూరికితెలిపినవిషయం)
నేనుచూసిందెవరిని?”
చ్చిన పూలను బద్రపరిచి సంకీర్తన ముగిసిం తరువాత వాటిని బాబా అమ్మ మూర్తుల మీద చల్లే వారు. అది 1980 వ సంవత్సరం అని అనుకుంటాను, మందిరంలో కుసుమతల్లి జన్మోత్సవానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను. పూలుకోయడానికి తోటలోకి వెళ్ళాను. నా దురదృష్టం, చెట్లలో 4,5 పుష్పాలు మాత్రమే ఉన్నాయి. నాకు చాల నిరుత్సాహం కలిగింది. నేను ఆ పూలను కోసి మందిరానికి వెళ్ళి ఎప్పటి లాగే శ్రీమతి సత్యవతమ్మ గారికి ఇచ్చాను. కొంత సేపటి తరువాత ఒక భక్తుడు ఒక బుట్ట నిండా రోజా పూలను తీసుకొని వచ్చాడు. అవి చూసి నేను నిరుత్సాహంతో మనస్సులో అనుకున్నాను, “బాబా, ఇన్ని పూలు వస్తాయని తెలిసే నా తోటలో పూలు లేకుండా చేశావా?” అని అనుకున్నాను. ఈ తలంపు నాలో కలిగిందో లేదో, సత్యవతమ్మగారు నేనిచ్చిన పూలను తీసుకొని వచ్చారు, వాటిని మాతా ప్రభువుల పాదాల వద్ద సమర్పించి చిరునవ్వుతో నాతో అన్నారు, “ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా?” అని. అలా అని ఆమె తన గదికి వెళ్ళి పోయారు. ఆమె ముఖ తీరు, మాట వరసలో నాకు ఏదో వ్యత్యాసం కనిపించి, అనుమానం వేసింది. నేను వెంటనే ఆమె గదికి వెళ్ళాను. అయితే ఆమె అక్కడ లేదు. అక్కడున్న వారు నాతో చెప్పారు ఆమె స్నానాల గదికి వెళ్ళి చాల సేపయిందనీ, ఆమె ఇంకా తిరిగి రాలేదనీ. నేను మూగబోయాను, అయితే పూలను మూర్తుల పాదాల చెంత పెట్టి,“ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా?” అని అడిగిన వ్యక్తి ఎవరు?
నా సందేహానికి ప్రత్యుత్తరం
సేపూరి అమ్మ (సేపూరి అల్లూరమ్మ, సేపూరి హరగోపాల్ యొక్క తల్లి) ఆదేశించిన లాగా నేను ప్రభుని ఒక పటం పెట్టుకొని నిత్యసేవ చేస్తూ వస్తున్నాను. ప్రభువును వాత్సల్యభావంతో చూసుకొంటూ ఆయన్ని ఒక బిడ్డగా భావించాను. అయితే నా మనస్సులో ఒక సందేహం పీడిస్తూనే ఉండింది, నా ప్రేమకు ఆయన ప్రతిచలిస్తున్నాడా, ఆయన నా యందు మాతృభావం కలిగి ఉన్నాడా అని. ఈ సందేహ నివృత్తి ఒక్క సేపూరి అమ్మ మాత్రమే నివర్తించ గలదని నాకు తోచింది, ఎందుకంటె ప్రభువు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి. ఆ కాలంలో సేపూరి అమ్మ తన అమ్మాయి డాక్టర్ వరలక్ష్మి ఇంట్లో తిరుపతిలో ఉండేది. నా అదృష్టం కొద్ది ఆ మనోవికలం సమయంలో డాక్టర్ వరలక్ష్మి ఏదో పనిమీద హైద్రాబాద్ వచ్చింది. నేను నా సందేహం గురించి ఆమెతో రహస్యంగా చెప్పాను. అయితే ఆ సందేహాన్ని సేపూరి అమ్మతో చెప్పవద్దనీ, ఒకవేళ ఆమే స్వయంగా ఏదైనా చెబితే నాకు తెలుపనీ విన్నవించాను. డాక్టర్ వరలక్ష్మి తిరుపతికి తిరిగి వెళ్ళిన తరువతా ఒకరోజు సేపూరి అమ్మ ఆమెతో చెప్పిందట, తనతో ప్రభువు చెప్పాడట, నేను తనని బిడ్డగా చూసుకొంటూ వాత్సల్యభావంతో సేవచేస్తున్నానని. ఈ విషయాన్ని డాక్టర్ వరలక్ష్మి నాకు తెలిపింది. దానితో నాకు సందేహ నివృత్తి కలిగి నా మనస్సు కుదుట పడింది. ప్రభువు నా సేవను అంగీకరించాడని మిక్కిలి పరవసించి పోయాను.

బ్లాగ్ పోస్ట్ # 30; 25.02.2017 - “హరనాథుని అపార కృప”: ఒక భక్తుని అనుభవం

హరనాథుని అపార కృప”: ఒక భక్తుని అనుభవం

( భక్తుని ప్రార్థన వల్ల అతని పేరు ప్రచురించ లేదు.)

నేను రైల్వే ఇంజన్ డ్రైవర్ని. నాకు హరనాథుని భక్తలోకంతో 2011 ఫిబ్రవరిలో పరిచయం కలిగింది. నాకు ప్రభువు మీద మిక్కిలి ఆకర్షణ ఏర్పడింది. హరనాథుని సంకీర్తనలలో పాల్గొనే వాణ్ణి. ఒకసారి 2011 ఆగష్టు 8వ తేది కలకత్తాలో బాగ్ బజార్ లో ఉన్న హరనాథ్ స్కూల్ లో సంకీర్తన ఏర్పాటు చేయబడింది. అందులో పాల్గొనాలని వాంఛ కలిగింది. అయితే అప్పట్లో ఇంజన్ డ్రైవర్ల కొఱత ఉండింది. కాబట్టి నాకు శెలవు దొరకటం దుర్లభం అని తేలింది. కాని నా వాంఛ బలంగా ఉండింది.

                  6వ తేది హౌరా నుండి చందన్ పూర్ వరకు నేను లోకల్ రైలును నడపాలని నాకు ఆజ్ఞ అందింది. నేను బండిని తీసుకొని హౌరా స్టేషన్ నుండి బయలు దేరాను. మొదటి పచ్చ సిగ్నల్ దాటాను. కాని ఏమి జరిగిందో తెలియదు, నేను పొరపాటు చేసి రెండవ సిగ్నల్ ఎఱ్ఱగా ఉండగానే దాటేశాను. ఇది దారుణమైన అపరాధం, దీనికి శిక్ష పని నుండి తొలగించటం కూడ జరుగవచ్చు. నేను ‘లిలుహా’ స్టేషన్ చేరగానే స్టేషన్ మాస్టర్ నా వద్దకు వచ్చి నాతో చెప్పాడు, నేను చేసిన అపరాధం గురించి. అది కేబిన్ రూములో పదివు చేయబడిందని కూడ చెప్పాడు. ‘డాంకుని’ స్టేషన్ లో ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పంపించారు నన్ను పరామరిస్తూ బండిని నడిపించటానికి.  నేను గమ్యం (చందన్ పూర్) చేరగానే వెంటనే హౌరా ఆఫీసుకు రమ్మని కబురు అందింది. నా నుండి వ్రాత కథనం తీసుకున్నారు. ఆరోజే ఎన్ క్వైరీ జరిపించారు. నేను ఇంటికి వచ్చేశాను. మరుసటి రోజు నాకు డ్యూటీ పిలుపు అందలేదు. 8వతేది నేను సీనియర్ క్ర్యూ కంట్రోలర్ తో ప్రస్తావించాను, నాకు డ్యూటీ పిలుపు రాలేదు కదా, నేను సంకీర్తనకు వెళ్ళవచ్చునా అని. ఆయన సలహా ఇచ్చాడు, నా మొబైల్ ను నాతో తీసుకొని వెళ్ళమని. ఏదైనా పిలుపు వస్తే నాకు వెంటనే తెలియజేస్తానని చెప్పాడు. లాంచ్ సర్వీస్ ను పట్టుకొని గంగానదిని దాటితే, నేను ఉత్తరపారా నుండి బాగ్ బజారు అరగంటలో చేరుకోగలను. కాబట్టి డ్యూటీ పిలుపు వస్తే త్వరగా వచ్చి హాజరు కాగలను. ఆవిధంగా సంకీర్తనలో పాల్గొనాలన్న నా వాంఛను ప్రభువు నెరవేర్చాడు.

                  అయితే నేను ఎఱ్ఱ సిగ్నల్ ను దాటిన అపరాధానికి అనుభవించ వలసిన శిక్ష నుండి కూడ నన్ను ప్రభువు కాపాడాడు. నాకు ఒక మాసం వరకు డ్యూటీ పిలుపు రాలేదు. అయితే నేరం క్రింద చార్జిషీటు నాకు అందలేదు. కాని నాకు జీతం అందింది. ఈ విచిత్రం ఏమిటో నాకింత వరకు బోధపడలేదు. ఒక మాసం తరువాత డ్యూటీ పిలుపులు అందసాగాయి. ప్రథమంలోనే తన కరుణ యొక్క రుచిని ప్రభువు నాకు చూపించాడు.

కుసుమహర బ్లాగ్ # 29; 15.02.2017 - "నా దిక్కులేని పరిస్థితిలో ప్రభుని దివ్య అభయం": ఎ.జయలక్ష్మి, హైదరాబాద్

“నా దిక్కులేని పరిస్థితిలో ప్రభుని దివ్య అభయం”:ఎ.జయలక్ష్మి, హైదరాబాద్

(Written by Sri Haragopal Sepuri, based on oral narration of Smt, Jayalakshmi)

నేను, డాక్టర్ వరలక్ష్మి తిరుపతి, ఇరువురమూ గుంటూరు కాలేజిలో సహవిద్యార్థులం.  ఆమె కుటుంబం వారు హరనాథ భక్తులు. ఆవిధంగా నాకు హరనాథునితో పరిచయం కలిగింది. 1937లో కుసుమమ్మ చెన్నైకు విచ్చేసినపుడు ఆమె దర్శనం నాకు కలిగినప్పటికీ హరనాథునితో పరిచయం వరలక్మితో పరిచయం కలిగిన తరువాతే సంభవించింది. ఆ కాలంలో వరలక్ష్మి యొక్క తల్లిదండ్రులు (సేపూరి లక్ష్మీనరసయ్య, సేపూరి అల్లూరమ్మ) నన్ను తమ కుమార్తె లాగా చూసుకునేవారు. ఇప్పటికీ వారి పిల్లలు నన్ను అక్కయ్యగానే గణిస్తారు. వారి ప్రేమను సరిగా అప్పుడు అర్థం చేసుకోలేక పోయాను. కొన్ని రోజుల తరువాత నేను వరలక్ష్మితో కలిసి కాళహస్తిలో వారి ఇంటికి  వెళ్ళాను. లక్ష్మీనరసయ్య గారు అక్కడ డిప్యూటి ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్  గా పనిచేస్తుండేవారు. అక్కడినుండి నేను ఈరోడ్ లో మా నాన్నగారి ఇంటికి వెళ్ళ దలుచుకున్నాను. వరలక్ష్మి వద్ద ఒక బాబా లాకెట్ చూశాను. అలాంటిది కావాలని ఇష్టపడ్డాను. ఒక జపమాల కూడ కావాలని ఇష్టపడ్డాను. వెంటనే చిరంజీవి సేపూరి హరగోపాల్ నాకు ఒక చిన్ని జపమాలను తెచ్చి ఇచ్చాడు. అది ఇప్పటికీ నా వద్ద ఉన్నది. అప్పటికి అతని వయస్సు పదేండ్లు. వారింటిలో కొన్ని రోజులు గడిపి, రైలులో మా ఊరికి బయలుదేరాను. తిరుపతి రైల్వే ప్లాట్ ఫారం మీద ఒక అబ్బాయి బాబా లాకెట్లు అమ్ముతున్నాడు. (సాధారణంగా బాబా లాకెట్లు ఇలా రైల్వే ప్లాటుఫారాల మీద అమ్మడం జరగదు.) ఒక లాకెట్ కొన్నాను. ఆ లాకెట్టును ముచ్చట పడుతూ చూస్తుండగా నా పర్సు పోయింది. అందులో నా టికెట్టు, డబ్బులు ఉన్నాయి.  కాట్పాడిలో నేను రైలు మారాలి. అక్కడ దిగిపోయాను, కాని అయోమయంగా నిలబడి పోయాను. రైలు వచ్చింది. ఒకతను రైలు పెట్టెలో ఉన్న ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో నేను వారి వైపే చూస్తూ ఉండిపోయాను. వారి సంభాషణలో ఎతిరాజులు నాయుడు అని చెప్పటం నా చెవిలో పడింది. ఆయన నా పినతండ్రి. రైలు వెళ్ళిపోయిన తరువాత ఆ వ్యక్తి (సత్యం) నా వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నించాడు. నేనాయన్ని అడిగాను, “మీకు ఎతిరాజులు నాయుడు గారు తెలుసునా?” అని. ఆయన తెలుసునని అన్నాడు. అప్పుడు నేను ఆయనతో చెప్పాను నా పర్సు, టికెట్టు డబ్బులతో సహా పోయిందని. ఆయన నాకు ధైర్యం చెప్పి, నన్ను ప్రయాణీకుల హాలులో కూర్చోబెట్టి, వెళ్ళి టికెట్ కొని తెచ్చి నాకిచ్చాడు. నా దారి ఖర్చులకని ఆయన వద్ద 5 రూపాయలు అప్పడిగి తీసుకున్నాను, ఇల్లు చేరుకున్నతరువాత ఆయనకు మనియార్డర్ చేస్తానని చెప్పి, ఆయన వద్ద అడ్రసు తీసుకున్నాను. అలాగే ఇంటికి వెళ్ళగానే ఆయనకు మనియార్డర్ ద్వారా 5 రూపాయలు పంపించాను. నాకు రసీదు తిరిగి వచ్చింది, అయితే అందులో దస్కత్తు తేటతెల్లంగా లేదు. కొంతకాలం తరువాత నేను నా పినతండ్రిని కలుసుకున్నపుడు, ఆయనకు చెప్పాను నాకు సహాయం చేసిన వ్యక్తిని గురించి. అలాంటి వ్యక్తి తనకు తెలియదని ఆయన అన్నారు. అయితే నాకు సహాయపడిన వారు ఎవ్వరు? అది ప్రభువే అయ్యుండాలని నిర్ణయానికి వచ్చాను.

(వ్యాఖ్యానం:  జయలక్మి గారి 18 వయస్సులోని సంభవం ఇది.  ఇప్పుడు ఆమె వయస్సు 90 సంవత్సరాలు. వారి అనుభవాలు ఫేస్ బుక్ లో ప్రచురింపబడుతున్నాయి.)

పోస్ట్ # 28 : 21.01.2017 - “మన శాశ్వత రక్షకుడు, శ్రీ కుసుమహరనాథుడు”: ధీర బందోయపాధ్యాయ, సోనాముఖి

మన శాశ్వత రక్షకుడు, శ్రీ కుసుమహరనాథుడు”: ధీర బందోయపాధ్యాయ, సోనాముఖి
(అనుకుల్ చంద్ర బెనర్జీ యొక్క కోడలు, కుసుమహరనాథుల మనవడి భార్య)

(Telugu translation: Sri Haragopal Sepuri)

అది 1965వ సంవత్సరం. మేము బొంబాయికి శెలవులకు వెళ్ళాము. నా కొడుకు వయస్సు అప్పుడు 4 లేక 5 సంవత్సరాలు. బొంబాయిలో కొన్ని రోజులు గడిపి, అక్కడి నుండి పూనాకు వెళ్ళాము, మాతా ప్రభువుల యొక్క అత్యంత భక్తుడైన శ్రీ బి.డి.వోరా ఇంటిలో బస చేశాము. రెండు రోజుల తరువాత అందరూ మహాబలేశ్వర్ కు వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. ఆ చల్లని పర్వత ప్రాంతానికి వెళ్ళడానికి నాకూ కుతూహలం కలిగి ఉండాలి. కాని నాకు అలా ఎందుకు  కలుగలేదో నాకు అర్థం కాలేదు. త్వరలో దాని అంతరార్థం నాకు బోధ పడనున్నదని నేనెరుగను. మేము వెళ్ళవలసిన రోజుకు ముందు రోజు సాయంత్రం నా కుమారునికి గొంతు నొప్పి ప్రారంభమయింది. అక్కడి ఒక హోమియో డాక్టర్ ను పిలిపించాము. ఆయన మందులిచ్చి బయపడవద్దని చెప్పి వెళ్ళి పోయాడు. అయితే నా కుమారుని పరిస్థతి దిగజారిపో సాగింది. రాత్రికల్లా అతడికి శ్వాస పీల్చడం కష్టమయింది, కడుపు ఉబ్బిపో సాగింది. అతడు బాధతో త్రుళ్ళడం చూడటానికి మిక్కిలి హృదయవేదనగా ఉండింది. నేను చేయగలిగిందల్లా బాబాకు అమ్మకు నా బాధను విన్నవించుకొనటం మాత్రమే. అందరి వదనాలు చూస్తే వారూ దైవసహాయం కొరకే నిరీక్షిస్తున్నట్లు అగుపించింది.

నా బాబు పరిస్థితి క్షీణించ సాగింది. ఉదయాన్నే ఒకరు లోకల్ ఆసుపత్రి ‘జహంగీర్ నర్సింగ్ హోమ్’ లోని ఒక డాక్టర్ ను పిలిచాడు.  అతడు వెంటనే తన స్కూటరు మీద వచ్చాడు. రోగిని చూడగానే అన్నాడు, “త్వరపడండి, పరిస్థితి విషమించింది” అని. నేను నిశ్చేష్టురాలినై నిలబడ్డాను. నన్ను బాబును తీసుకొని తన వెనక స్కూటర్ లో కూర్చోమన్నాడు, శ్రీ వోరాను తన కారును తీసుకొని వెనక రమ్మన్నాడు, శరవేగంతో స్కూటర్  నడిపాడు. నర్సింగ్ హోమ్ లో రెండు ఇంజక్సన్ లను ఇచ్చాడు. ఇంతలో మిగతా వారూ వచ్చి చేరారు. డాక్టర్ అన్నాడు, బాబుకు డిఫ్తీరియా వ్యాధి సంక్రమించిందనీ, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదమనీ చెప్పాడు. తరువాత మా గుండెలు ఆగిపోయే విషయమూ చెప్పాడు, నగరంలో ఉన్న ఆసుపత్రులు కానీ, నర్సింగ్ హోములు కానీ డిఫ్తీరియాకు చికిత్స చేయటానికి ఉత్తరువు లేదనీ, రోగిని ఊరుకు వెలుపల నున్న నిశ్చిత ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలనీ చెప్పాడు. దూరంలో ఉన్న ఆసుపత్రికి ఎలా తరలించటం. నా మనస్సు నిర్జీవమై పోయింది, నిశ్చేష్టంగా బాబును ఎత్తుకొని ఇతరులతో కారులో ప్రయాణం చేయడానికి కదిలాను. అయితే మా కష్టాలకు విమోచనం ఇంకా కలగలేదు. డ్రైవర్ కారు వద్ద కనిపించ లేదు. అందరూ అతణ్ణి అన్వేషిస్తూ పరుగెట్టారు. ఇంతలో తెల్ల దుస్తులు ధరించిన ఒక బృందం నర్సింగ్ హోమ్ లోనికి ప్రవేశించటం చూశాను. ఎవరో ఒకరు చెప్పటం నా చెవిలో పడింది. మహారాష్ర్టలోని వైద్యనిపుణులు వేరే చోట సమావేశం చేయబోగా అది ముందు రోజు ఎందుకో రద్దు చేయబడింది. కాబట్టి దానిని ఈ నర్సింగ్ హోమ్ లో నిర్వహించడానికి అప్పుడు ఇక్కడికి వచ్చారట. ఆ బృందం నుండి ఒక నడివయస్కుడైన డాక్టర్ వచ్చి నన్నడిగాడు బాబుకు ఏమైందని. నేను బదులు చెప్పే పరిస్థితిలో నేను. ఆ నర్సింగ్ హోమ్ డాక్టరు అతనికి విషయం తెలిపాడు. నా కుమారుని పరిస్థితి చూసి అతడు గట్టిగా అరిచాడు, “ఇతని పరిస్థితి మిక్కిలి ప్రమాదస్థతిలో ఉంది,” అని. వెంటనే బాబును, చట్టనిషేధాలను, తీసుకొన వలసిన జాగ్రత్తలను ఉల్లంఘించి, ఆపరేషన్ తియేటర్ కు తరిలించాడు. బాబా అమ్మలు మరో నాటకం ప్రారంభిస్తున్నారని నాకు అర్థమయింది. నా సంక్షోభం క్షణంలో అణగారిపోయింది, నాలో ప్రశాంతత నెలకొన్నది. శస్త్రచికిత్స విజయవంతంగా సాగింది, నా కుమారునికి ప్రాణం అనుగ్రహించ బడింది.

ఈ అద్భుతమైన విషయాలు ఒకటి తరువాత ఒకటి ఎలా సంభవించాయి? ఆ దయాళుడైన డాక్టర్ నా బాబును నర్సింగ్ హోమ్ కు తరలించి వెంటనే ఇంజక్సన్ ఇవ్వటం, ఎక్కడో జరుగవలసిన సమావేశం రద్దు కావటం, ఆ సమావేశ వేదిక ఈ నర్సింగ్ హోమ్ కు తరలించటం, సర్జన్ చట్టనిషేధాలను ఉల్లంఘించి శస్త్రచికిత్స చేయటం, ఈ అద్భుతాలను నిర్వహించిన వాడెవరు? దయాళురైన నా బాబా అమ్మలు అసహాయస్థిలో ఉన్న బాధితుల విషయాలను పెడచెవిని పెట్టరని మరల అర్థం చేసుకున్నాను. శస్త్రచికిత్స ముగియగానే డాక్టర్ అన్న మాటలు “భయపడకండి, మేమున్నాము,” బాబా భజనలోని మాటలను గుర్తుకు తెచ్చాయి, “అడుగడుగునా నేను మీతోనే ఉన్నాను (ఆమి రే తోదేర్ కాచ్చె నితి ఆచ్ఛి పాచ్ఛే పాచ్ఛే).”
ఈ సంభావన్ని తిలకించిన వారు కుసుమహరనాథుని మహాభక్తులైన  శ్రీ కృష్ణదాస్ మోడి,  శ్రీ మాధవ్ దాస్ మోడి,  శ్రీ బి.డి.వోహ్రా,  శ్రీ పి.బి.వోహ్రా,  శ్రీమతి జయ మోడి,  శ్రీమతి రసిక మోడి. ఇందు నుండి నాకు కలిగిన మరొక జ్ఞానం ఏమిటంటే, ఈ క్లిష్ట సమయంలో ఇందరు మహాభక్తులు మమ్మల్ని పరివేష్టించి ఉండటం వల్ల ప్రభువు మమ్మల్ని రక్షించడానికి తానే స్వయంగా కలుగజేసుకోవలసి వచ్చింది.  భక్తులు ఆయన హృదయం కదా! ఒక బెంగాలీ గీతం గుర్తుకు వచ్చింది. “ప్రభుని చరణాలు విడువని భక్తునికి జయమ, తన బిడ్డలను విడువని ప్రభువుకు జయము . . . . ఒకవేళ పరిచారకుడు బుద్ధిమాంద్యం వల్ల దారి తప్పినా, అతని జుట్టు పట్టుకొని రక్షించే ప్రభువుకు జయము.” . . . . . నా ప్రభువుకు జయము, ఆయన భక్తులకు జయము.

బ్లాగ్ పోస్ట్ 27; 27.12.2016 -"సదా నాకు రక్షకుడుగా ఉన్న బాబా రచయిత": ఆర్.జి.ప్రకాష్, బెంగలూరు"

“సదా నాకు రక్షకుడుగా ఉన్న బాబా రచయిత”: ఆర్.జి.ప్రకాష్, బెంగలూరు

(Telugu translation: Sri. Haragopal Sepuri)

ఎన్నో మార్లు నా జీవితంలో బాబా యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని అనుభవించిన భాగ్యం నాకు కలిగింది. ఇవి నాకు అత్యంత ఆనందాన్ని మాత్రమే కాదు, అన్ని ప్రతిబంధకాలను ఎదుర్కొనే విశ్వాసాన్ని కలిగించాయి. ప్రభువు సదా నా చెంతనే ప్రతి అడుగునా ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఈ అనుభవాలను వ్రాత మూలంగా తెలుపడానికి నాకు సాధ్యం కాదు. అయినా ఇటీవలి ఒక చిన్ని సంభావాన్ని తెలుపుకుంటున్నాను.

2016వ సంవత్సరం అక్టోబర్ లో సోనాముఖిలో జరిగిన నామసప్తాహం నుండి తిరిగి వచ్చిన తరువాత నాకు అస్వస్థత  కలిగింది.  కిషోర్ ను పిలిపించాను. అతడు నన్ను ఆసుపత్రికి తనిఖీ చేయించుకొనడానికి తీసుక వెళ్ళాడు. ఎక్స్రే రిపోర్టులు చూసి నాకు న్యుమోనియా వ్యాధి సంక్రమించిందని డాక్టర్లు నిర్ణయించారు. నన్ను ఐ.సి.యు లో పెట్టారు. నాకు కొంత గుణం కనిపించగానే మూడు రోజుల తరువాత నన్ను జెనరెల్ వార్డుకు తరలించారు. మరి రెండు రోజుల తరువాత నన్ను ఇంటికి పంపించారు. రెండు రోజులు నాకు బాగానే ఉండింది, సాధారణ ఆహారం ఆరగించ సాగాను, ఇంట్లో మెల్లగా తిరుగ గలిగాను. అయితే ఆ తరువాత నాకు మిక్కిలి శరీర కష్టానుభవం కలిగింది, ఒక రాత్రి పూర్తిగా నిద్ర పోలేక పోయాను. మరుసటి రోజు ఉదయం కిషోర్ నన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు. నా ఎక్స్రేను చూసి డాక్టర్లు విస్తు పోయారు, నా ఊపిరితిత్తులలో గళ్ళ నిండుకొని ఉంది. నా పరిస్థితిని చూసి అమెరికాలో ఉన్న నా కుమారుణ్ణి వెంటనే పిలిపించమన్నారు. అతడు విమానం దొరకగానే వచ్చి చేరుకున్నాడు. నా పరిస్థతి మిక్కిలి ప్రమాదస్థితిలో ఉందనీ, అందుకు వయస్సు కూడ కారణమనీ, చికిత్స అధిక వ్యయంతో కూడుకున్నదనీ, నేను బ్రతకడానికి వారు హామీ ఇవ్వలేమనీ చెప్పారు. ఆలోచించి అతని నిర్ణయమేమిటో తెలుపమన్నారు. నా కుమారుడు మాకు భగవంతునియందు నమ్మకం ఉందని తెలుపుతూ వెంటనే చికిత్సను ప్రారంభించమన్నాడు. ఐ.సి.యులో పదిహేను రోజులు చికిత్స జరిగింది. నా స్థితి క్రమంగా తేరుకుంది. ఒకరోజు ఐ.సి.యులో నేను మంచం నుండి దిగి, కుర్చీలో కూర్చో దలిచాను. నా ప్రక్కనే ఉన్న మగనర్సును సహాయమడిగాను. అతడు నన్ను మెల్లగా కూర్చోబెట్టాడు. ఒక గంట కాలం నేను కూర్చీలో కూర్చొని తిరిగి పడకలోకి వెళ్ళ దలిచాను. అప్పుడు మగనర్స్ అక్కడు లేడు. ఇద్దరు ఆడనర్సుల సహాయంతో, ప్రక్కనే ఉన్న వారి బుజాల మీద చేతులను ఊని లేవబోయాను. నా కాళ్ళలో బలం లేదు, అవి తడబడ్డాయి. అందువల్ల నేను నర్సుల మీద వాలిపోయాను. మేము ముగ్గురం క్రింద పడిపోయే పరిస్థితి. ఆ సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఒక సీనియర్ ఆడ నర్సు సాక్షాత్కరించింది, నా రెండు కాళ్ళను ఎత్తిపట్టుకొని ఒక్క ఊపుతో నన్ను పడక మీద పడుకోబెట్టింది. నేను కొంత సర్దుకొని ఆమెకు కృతజ్ఞత తెలుపుడానికి తిరిగి చూశాను, కాని ఆమె కనిపించలేదు. నేను ఆ ఇరువురు నర్సులను ఆమె ఎవరని అడిగాను, ఆమె ఎవరో వారికి తెలియదని వారు చెప్పారు. తరువాత నేను ఆసుపత్రి సిబ్బందిని ఆమెను గురించి అడిగాను, ఆ నర్సు ఎవరో వారూ గుర్తించలేక పోయారు. బాబానే ఒక స్త్రీ రూపంలో నాకు సహాయ పడడానికి వచ్చాడని నాకు ఇప్పడు నమ్మకం కలిగింది. మన జీవితంలో ఆయన మన చెంతనే సదా ఉన్నాడు, మనమే ఆయన్ని తరచు గుర్తించ లేకుండా పోతున్నాము. ఆయన యొక్క ప్రేమ కరుణలతో నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. బలహీనత కొరకు ప్రోటీన్లను, విటమినులను తీసుకొంటున్నాను, ఔషధాలు ఇప్పుడు నాకు అవసరం లేదు.

పోస్ట్ # 26 : 13.12.2016: మన మనస్సుల భారాన్ని తరిగించటం

మన మనస్సుల భారాన్ని తరిగించటం
 (ఒక దృఢ భక్తుడు బహిరంగ పరచిన విషయాన్ని తిలక్ ఘోషాల్ తెలుపుతున్నాడు.)
(Telugu translation: Sri Haragopal Sepuri)

 ఇది నా జీవన సంధ్యాకాలం, ప్రభు హరనాథుడు తన ఆత్మీయ భక్తులతోటి పరిచయాన్ని నాకు ప్రేమతో అనుగ్రహించాడు. అవి ఆత్మానుబంధంగా పరిణమించాయి. అలాటి వారితో నేను ఫోను మూలంగానో, ఈ-మెయిల్ మూలంగానో సంబంధం సాగిస్తూనే ఉన్నాను. ఈ సంబంధాలు నాకు మిక్కిలి జ్ఞానబోధకంగా ఉపకరించాయి. ఇటీవలి ఒక టెలిఫోన్ సంభాషణలో ఒక భక్తుడు తన కోడలి యొక్క మిక్కిలి అతిశయ అనుభవాన్ని నాతో పంచుకున్నాడు. దానిని నేను క్రింద తెలుపుతున్నాను. అయితే అతని కోరికమీద వారి పేర్లను మరుగు పరుస్తున్నాను. ఆయన్ని “హ” అని ఆయన కోడలిని “క” అని సంకేతాలతో సూచిస్తున్నాను.

“క” యొక్క వివాహం తరువాత, అత్తవారి ఇంటిలో ఆమెకు కుసుమహరనాధుని ప్రపంచంతో క్రమంగా పరిచయం కలిగింది. ఆ కుటుంబంలోని సభ్యులకు బాబా మీద, అమ్మ మీద ఉన్న గాఢ భక్తి ప్రేమలు ఏమిటని ఆమెకు సాక్షాత్తు గోచరమయింది. ఆమె ప్రభుని భక్తుల కుటుంబంలో భాగస్వామి అని విధి నిజంగా నిర్ణయించింది, (నా వారిని నేనే ఎన్నుకుంటానని కదా ప్రభువు చెప్పాడు.) అందువల్లే ఆమెకు కుసుమహరనాథుల మీద ఆకర్షణ గాఢమై, సహజంగా వారికి అంకితం అయిపోయింది.  హరనాథుని గురించి చెప్పగా ఆలకించింది, ఆయన్ని గురించి చదివింది. ఆయన ఉపదేశించిన సదా కృష్ణనామ స్మరణ సందేశం ఆమె మనస్సులో బాగా పాతుకుంది. అయితే ఆమెకు ఇక్కడే ఒక సమస్య ఎదురయింది. పదహారువేల నూట ఎనిమిది భార్యలను పొందిన దేవుణ్ణి ఎలా ఆరాధించటం అనే ప్రశ్న ఆమె మనస్సును వేధించ సాగింది. ఆధునిక విద్యావంతురాలైన ఆమె యొక్క మనస్సు ఈ సత్యాన్ని అంగీకరించలేక పోయింది. దీని వల్ల ఆమె మనస్సు సంశయానికి, భ్రమకు గురి అయింది. అప్పుడు ఇది సంభవించింది. ఆమె భర్త ఈ మధ్య తన తండ్రికి (“హ” కు) ఫోన్ చేసి “క” కు ఆ రోజు ప్రొద్దున ఒక అద్భుత అనుభవం కలిగిందనీ, అది ఆమె ముఖతః వినమనీ చెప్పాడు. “క” ఫోనులో మాట్లాడింది, అయితే ఆమె ఆ అనుభవం కలిగించిన పరిణామం నుండి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కంపిస్తున్న కంఠంతో ఆమె చెప్పినది ఇదీ:

ఆరోజు ప్రొద్దున ఆమె తన నిత్య పూజలో నిమగ్నమై ఉండింది, అయితే ఆమె మనస్సు కృష్ణుడు అందరు భార్యలను పొందాడే అన్న తలంపుతో కలవర పడుతూనే ఉండింది. కొంత సేపటి తరువాత ఒక మృదు హస్తం ఆమె భుజాన్ని స్పర్శించటం గమనించింది. ఉలిక్కిపడి తిరిగి చూసింది. మందస్మితుడైన హరనాధుడు నిలబడి ఉండటం చూసి ఆమె మనస్సు, శరీరం కొయ్యబారి పోయాయి. పూజలో ఉన్న కృష్ణుణ్ణి చూపెట్టి ప్రభువు అన్నాడు, “అమ్మా, నేనూ ఆయనా ఒక్కరే, మా మధ్య విభేదం లేదు,”  అని. . . . . ఒక్క క్షణం. . .అంతే ఆయన అదృశ్యుడయ్యాడు. ఆమె పరవశంతో అచంచలంగా ఉండిపోయింది, ఆమె దేహం గాలిలో రెపరెప లాడే పత్రంలా కంపించింది, తన చక్షువులను, వీనులను నమ్మలేని పరిస్థితిలో ఉండిపోయింది. తన సందేహాలు, భ్రమలు తీరిపోయాయి.

గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆమె ఉద్యోగం చేస్తున్న విద్యావతి. ఒక ప్రశస్త సంస్థలో ఉన్నత స్థాయిలో ఉండి, తరచు పనులమీద ఒక్కతే ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. సంగ్రహంగా చెప్పాలంటే ఆమె ఆధునిక ధృక్ పథం కలిగిన, ఆత్మవిశ్వాసం కల, అన్వేషణ స్వభావం కలిగిన ఒక వివేకవతి, అందుకే కాబోలు ప్రభువు అందరికీ సూక్ష్మ సూచనలను ఇచ్చే మాదిరిగా కాకుండా, ఆమెతో ప్రత్యక్షంగా వ్యవహరించ వలసి వచ్చింది. పాగలుడు వివిధ మనస్సులను వివిధ రీతులలో అయోమయాలనుండి, సందేహాలనుండి విడుదల చేసే ప్రయత్నం అద్భుతం. అందువల్లే ఆయన ప్రీతిపాత్రుడుగా విశిష్టంగా వర్తిస్తున్నాడు.

బ్లాగ్ పోస్ట్ # 25; 27.11.2016 - "నిత్యుడైన మన మార్గదర్శకుడు": (హరనాథ ప్రభుని మనవడైన కీ.శే. బిజయ్ కృష్ణ బెనర్జీ యొక్క అనుభవం)

నిత్యుడైన మన మార్గదర్శకుడు (హరనాథ ప్రభుని మనవడైన కీ.శే. బిజయ్ కృష్ణ బెనర్జీ యొక్క అనుభవం)
              శ్రీమతి ధీరా బెనర్జీ తెలిపిన విషయం తిలక్ ఘోషాల్ చేత వ్రాయబడింది

(Telugu translation: Sri Haragopal Sepuri)

నేను తెలుపుతున్న ఈ విషయయం ఇటీవలే ధీరా అత్తయ్య నాకు తెలిపింది. ఇది ఆమె యొక్క భర్త శ్రీ బిజయ్ కృష్ణ బెనర్జీ యొక్క అపూర్వ అనుభవం. బిజయ్ కృష్ణ మామయ్య మాతాప్రభువుల మనవడు. ధీరా అత్తయ్య యొక్క సంపూర్ణ అనుమతితో దీనిని నేను బహిరంగం చేస్తున్నాను.

మామయ్య ముక్కోపి అనే చెప్పాలి. ఆయన్ని నిజంగా ప్రేమించిన వారందరూ దానిని సహించి ఉండేవారు. ఆయన దృఢ విశ్వాసం ఏమిటంటే, కుసుమహరనాథుణ్ణి గురించి విస్తారంగా ప్రచారం చేయాలని, ఎందుకంటె తెలియని వేలాది ప్రజలు కూడ ఆయన ప్రేమను, కృపను, రక్షణను పొందాలని. అయితే కాలం దొర్లుతున్న కొద్ది భక్తులు అనేకంగా భజనలు, కీర్తనలు, పాటలు, నృత్యాలకు తమ కాలాన్ని వినియోగిస్తున్నారే కాని ప్రభువు యొక్క ముఖ్యమైన కార్యంలో శ్రద్ధ చూపటం లేదని, చేపట్టటం లేదని ఆయన భావించారు. ఇది ఆయనలో మిక్కిలి నిస్పృహను కలగించ సాగింది. పర్యవసానం ఏమిటంటే, ఎవరైనా సోనాముఖికి విచ్చేసిన భక్తులు ఆయన్ని కలుసుకుంటే ఆయన వారికి మిక్కిలి చివాట్లు పెట్టడం ప్రారంభించారు. ఆయన యొక్క ఈ నడవడిక ధీరా అత్తయ్యలో భీతిని కలిగించింది, ఈ విధంగా భక్తులను అవమానించటం (భక్తాపరాధం) వల్ల తమకు ఏమి ముప్పు వాటిల్లుతుందో నని. ఆ రోజుల్లో మామయ్య, అత్తయ్య, వారి కుమారుడు రాణా, “హరనాథ్ శాంతి కుటీర్” కు ఎదురుగా ఉన్న “బిషేర్ బాఱీ” అనే రెండస్తుల భవనంలో క్రింది భాగంలో నివసిస్తూ ఉండేవారు, రెండు గదులు, వరాండా, చిన్న పెరడు ఉండేవి. ఈ వరాండాలోనే వారు భక్తులను కలుసుకునే వారు. అది 1980 లోనో, 1981 లోనో నేను తెలుపబోయే విషయం సంభవించింది. రాత్రి భోజనాననంతరం మామయ్యకు నిద్ర పట్టటం లేదని వరాండాలోనే కొద్ది సేపు కూర్చున్నారు. అత్తయ్య వెళ్ళి పడుకుంది, ఆమెకు వెంటనే నిద్ర పట్టేసింది. మరుసటి రోజు ప్రొద్దున్నే మామయ్య మిక్కిలి ప్రశాంతంగా పరధ్యానంగా ఉండటం గమనించింది. ఏదో గందరగోళం జరిగిందని భావించి,  ఆయన్ని కలవరపెడుతున్న విషయం ఏమిటని ఆమె ఆయన్ని మరి మరి ప్రశ్నించసాగింది. ఏమీ లేదని మొదట ఆయన త్రోసిపుచ్చాడు, తరువాత రాత్రి సంభవించిన అతిశయ విషయాన్ని తెలిపాడు. అది ఏమిటంటే,

ఆయన వరాండాలో కుర్చీలో కూర్చొని ఉండగా, రాత్రి బాగా చీకటి పడింది. కీచురాళ్ళ శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎంత సేపు అలా సాగిందో తెలియదు, అకస్మాత్తుగా ఆయన భుజం మీద ఎవరో చేయి వేసిన స్పృహ కలిగింది. ఆయన తిరిగి చూశాడు, కాని చీకటిలో ఆయనకు ఏమీ కనిపించలేదు. ఆయన చెవి వద్ద నిశ్వాస వేడి తగిలింది, ఏమిటని ఆయన గుర్తించే లోగా ఆయన చెవిలో మృదువైన మాట వినిపించింది, “తండ్రీ నా నామ ప్రచారం గురించి ఎందుకంత కలత చెందుతున్నావు? విచారించటం విరమించు,” అని. తరువాత అంతా నిశ్శబ్దం.

ఆ రోజు రాత్రి నుండి ఆయన మరణించే వరకు మామయ్య ప్రభువు యొక్క నామప్రచారం గురించి నోరు విప్పలేదు.

బ్లాగ్ పోస్ట్ # 24; 12.11.2016 - వ సంభవం అమ్మ యొక్క ప్రేమానురాగం రచయిత : వల్లభ మిత్ర, కొల్కాతా

వ సంభవం అమ్మ యొక్క ప్రేమానురాగం రచయిత : వల్లభ మిత్ర, కొల్కాతా
(ఈయన కుసుమహరనాథుల దృఢ భక్తుడైన శ్రీ లాల్ గోపాల్ మిత్ర గారి మనవడు, పురాతన భక్తులు శ్రీ లాల్ గోపాల్ మిత్ర గారిని, “లాలు దాదాబాబు,” అని పిలిచే వారు)
(Telugu translation: Sri Haragopal Sepuri

నాలుగు తరాలుగా, మా కుటుంబ సభ్యులకు థాకూరు హరనాథుడు, “కుటుంబ యజమాని బాబా,” అని, అమ్మ కుసుమకుమారి “కుటుంబ యజమానురాలు అమ్మ,” అని పరిచయంగా ఉండేవారు. మా తాతయ్య శ్రీ లాల్ గోపాల్ మిత్ర కుసుమమ్మకు మిక్కిలి సన్నిహితంగా ఉండేవారు. ఆయన కుసుమమ్మను “బామ్మా,” అని పిలిచేవారు. అమ్మ ఆయన్ని “లాలూ,” అని పిలిచేది.  తన లాలు మీద అమ్మకు అపరిమితమైన ప్రేమ ఉండేది, అలాగే  ఆయనకు అమ్మ మీద పూర్ణ భక్తి ఉండేది,  ఆయన అమ్మ పాదాలకు పూర్తిగా సమర్పణ చేసుకున్నారు. నేను చెప్పబోయే సంభవం మా బామ్మనుండి నేరుగా విన్నది.

తాతయ్య  ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన  బర్డ్ అండ్ హెయిల్జర్స్  కంపెనీలో పలిచేసే వారు.  ఒకసారి కుసుమమ్మ సాయంకాలం రైలులో బొంబాయికి ప్రయాణం చేస్తుండగా,  తాతయ్య తన ఆఫీసు పని ముగించుకొని వేగంగా హౌరా స్టేషన్ కు వెళ్ళాడు ఆమెను సాగనంపడానికి. కలకత్తానుండి, చుట్టుప్రక్కల నుండి అదే కారణంగా చాలమంది వచ్చి చేరారు.  ఒకే వాగుడు, సరసాలు, నవ్వులు. రైలు కదిలే సమయంలో హఠాత్తుగా అమ్మ ఆజ్ఞాపించింది, “లాలూ రైలులోకి వచ్చి కూర్చో,” అని.  ఆయన సంకోచంతో సణుగుతూ అన్నాడు, “బామ్మా,  నగదుపెట్టె తాళం చెవి నా వద్దే ఉంది. దానిని మరొకరికి అప్పగించితే కాని ఆఫీసులో పని నడవదు. అదీగాక ఉత్తర్వు లేకుండా సెలవు తీసుకుంటే  అపరాధంగా చూస్తారు. నా వద్ద డబ్బు లేదు, మార్చుకొనడానికి దుస్తులూ లేవు.  నేనెలా రాగలను, బామ్మా?” బామ్మ అన్నది, “నేను నిన్ను రైలులో కూర్చోమని కదా చెప్పాను, ” అని. అంతే మారు మాటాడకుండా తాతయ్య రైలెక్కి కూర్చున్నారు. అవిధేయతను సహించలేని బర్డ్ అండ్ కో లాంటి సంస్థను,  కఠినుడైన అధికారిని  తలుచుకొని  ఆయన తన ఉద్యోగం ఊడిపోతుందనే నిర్ధారణకు వచ్చాడు.  ఒక సహ భక్తుడు ఇంటికి వచ్చి బామ్మకు ఈవిషయం చెప్పగా, ఆమె ఖిన్నురాలయింది తాతయ్య అలా బాధ్యత లేకుండా ప్రవర్తించాడే అని, అతని ఉద్యోగం ఊడిపోతే అంత మందిని ఎలా పోషించగలమా అని.

సరే పదిరోజుల తరువాత తాతయ్య కోల్కాతా కు తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం కఠినుడైన తన అధికారి చీవాట్లను తలుచుకొంటూ, తన ఉద్యోగం ఊడిపోతుందని భీతిల్లుతూ ఆఫీసు చెరుకున్నాడు, తన నగదు పెట్టె వద్ద కూర్చున్నాడు. పని సాగిపోతూ ఉంది, కాని తన అధికారి తనను పిలువలేదు, తన సహ ఉద్యోగులు తాను ఆఫీసుకు ఎందుకు రాలేదని ప్రశ్నించ లేదు. ఆయన సంధిగ్ధం తీరలేదు, కాని కొంత ధైర్యం కలిగింది. రోజు గడిచిపోయింది, ఏమీ వ్యతిరేకంగా జరుగలేదు. ఆయన ఉద్యోగం ఊడిపోవటం మాట అటుంచి, ఆయన ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడని ఒక్కరూ ప్రశ్నించలేదు. తాతయ్యకు నమ్మకం కలిగింది,  తాను లేనప్పుడు మరొక  “లాల్ గోపాల్” తన బల్ల వద్ద కూర్చొని ఉండినాడని. భగవంతుని పాదపద్మాల చెంత హృదయాత్మలను అర్పించుకున్న భక్తుని విషయంలో ఇలాంటి విషయాలు సమకూరుతూ ఉంటాయి.
జయ్ శ్రీ కుసుంహరనాథ్

Blog Post # 23; 25.10.2016 - "శాశ్వత రక్షకుడు రచయిత్రి": శ్రీమతి వి.ఎస్.సనత్ కుమారి, బెంగుళూరు

శాశ్వత  రక్షకుడు రచయిత్రి”: శ్రీమతి వి.ఎస్.సనత్ కుమారి, బెంగుళూరు
(తిలక్ ఘోషాల్ చేత సరిచూడబడి, రచయిత్రి అనుమతితో ప్రచురింపబడింది)
(తెలుగు అనువాదం హరగోపాల్ సేపూరిచే చేయబడింది)

కుసుంహరలీలాస్ బ్లాగ్ సైట్ లో (15వ సమర్పణ) నేను నన్ను క్లుప్తంగా పరిచయం చేసుకున్నాను. అందులో స్వామి (బాబా) మా జీవితాలలో  జరిపిన లీలలు సహభక్తులతో పంచుకున్నాను. ఈ రోజున మరి రెండు సంభవాలను పరిచయం చేస్తున్నాను. మమ్మల్ని ఆయన సర్వదా గమనిస్తూ కాపాడుతూ ఉన్నాడని వీటినుండి నిశ్చయమవుతున్నది.

1వ సంభవం 
ఒకరోజు నేను నా భర్తతో కలిసి స్కూటర్ మీద ఇంటికి తిరిగి వస్తున్నాము. ఆ సమయంలో వాహనాల ప్రవాహం క్రిక్కిరిసి ఉండింది.  ఆ వీధిలో మా వైపుకు ఒక ఆవు ఎదురు రావటం అకస్మాత్తుగా చూసాము. రోడ్డులో రిపేర్ల కొరకు పడి ఉన్న ఇనుప ఊచలు అడ్డంగా ఉన్నందువల్ల, ఎదురుగా వస్తున్న వాహనాలు క్రిక్కిరిసి ఉన్నందు వల్ల, ఆవును ఢీకొనడం నిశ్చయమని అనిపించింది. పర్యవసానం ఏమిటంటే, మేము క్రింద పడిపోయి పెద్దవాహనాల క్రింద నలిగి పోయి మరణించవచ్చు.  ఆఖరి క్షణాలలో ఆశ్చర్యంగా ఆ ఆవు ఎవరో దాని కొమ్ములు పట్టుకొని లాగినట్లు ఇనుప ఊచల వైపుకు వెళ్ళి పోయింది. దాని ప్రక్కన ఎవ్వరూ లేరు. మేము భ్రమిసి పోయాము, ఏవిధంగా నిశ్చయమరణం నుండి తప్పించుకోగలిగామా అని. ఇప్పుడు కూడ ఆ సంభవాన్ని తలుచుకుంటే వారి మీద కృతజ్ఞతగా కళ్ళలో నీళ్ళు తిరగుతాయి. ఇప్పుడు నేను ప్రతిరోజు అమ్మకు, స్వామికి పాద సేవ చేస్తాను.  ఈ విధంగా భక్తులను ఆపదలనుండి కాపాడటంలో వారి అవయవాలు అలిసిపోయి బాధ చెందవా అని నేను భావిస్తాను.

2వ సంభవం
ఒకసారి  మేము ఆరుగురం – నా సహోదరుడు, వదిన, నా అక్కయ్య, బావగారు, నేను నా భర్త – సింగపూర్ కు విహారార్థం వెళ్ళాము. మా దురదృష్టం వల్ల అక్కడ విమానాశ్రయంలోనే నా భర్త మెదడుకు స్ట్రోక్ తగిలి స్పృ హ లేకుండా పడిపోయాడు. అక్కడి డాక్టర్లు పరీక్షించి  ప్రథమచికిత్స చేసి, వెంటనే ఆసుపత్రిలో చేర్పించమని సలహా ఇచ్చారు. మేము స్తంభించి పోయాము – ఒక అపరిచయ ప్రదేశంలో, చేతిలో పరిమిత డబ్బుతో, స్పృహావిహీనంగా పడి ఉన్న రోగితో దొరుక్కొని పోయాం. ఆయనను ఆసుపత్రిలో చేర్పించాలని అర్థమయింది. అయితే పరిచయస్తులు లేని, భాషతెలియని విదేశంలో మేమేమి చేయగలం  మేము తిరుగు విమానంలో ఇండియాకు వెళ్ళి అక్కడ ఆసుపత్రిలో ఆయన్ని చేర్పిస్తామని ఎలాగో డాక్టర్లకు సంజాయిషి చెప్పి తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్లు చేయించుకున్నాము, ఎప్పుడు సూర్యోదయమవుతుందా అని కాచుకొని కూర్చున్నాము. నా భర్తకు రోగనివారణ చేయమని స్వామిని ప్రార్థిస్తూ కుసుమహర నామజపంతో రాత్రి గడిపాము.

రాత్రి గడిచే కొలది ఆయనలో కొంత చలనం చూశాము, ఆయన తేరుకుంటున్నట్లు అగుపించింది. తెల్లవారే లోపుల ఆయన పూర్తిగా కోలుకున్నారు. మెదడు దెబ్బతిన్న వ్యక్తి ఏవిధమైన చికిత్స లేకుండా, అంత త్వరలో కోలుకొనటం సాధ్యమా? స్వామి వారి లీల మా ప్రత్యక్షంలో జరిగింది. నా భర్త పూర్రిగా కోలుకున్నాడని అనడానికి నిదర్శనమేమిటంటే, మేము సెన్తోశ ద్వీపం ప్రయాణం సాగించాము, ఉద్యానవనం చేరుకొనడానికి ఆయన ఏ బడలికా లేకుండా అన్ని మెట్లు ఎక్కగలిగారు. మాజీవితాలలో సంభవించిన ఇతర లీలల కంటె ఈ లీల నాల�

Blog Post # 22; 16.10.2016 - "బాలాజీ దర్శనం కోరిక ఫలించింది రచయిత్రి": శ్యామాలి చఠర్జీ, బాంకురా

“బాలాజీ దర్శనం కోరిక ఫలించింది రచయిత్రి”: శ్యామాలి చఠర్జీ, బాంకురా 

(ప్రభుహరనాథుని కుమారుడైన బసంత్ కుమార్ యొక్క కుమార్తె)

(Telugu transltion: Sri. Haragopal Sepuri)

అది 2012వ సంవత్సరం. నా చిన్నికుమారుడు, చెన్నైలో టి.సి.ఎస్ లో ఇంజనీరుగా పలిచేస్తున్నాడు. అతడు తాంబరం రైల్వేస్టేషన్ కు దగ్గరలో ఒకచిన్న అపార్ట్ మెంట్ కొన్నాడు. ఆ అపార్ట్ మెంట్ గృహప్రవేశానికి నేను, నా భర్త, నా సోదరి, నా బావగారు, వారి ఇరువురు అమ్మాయిలు, వెళ్ళాము.

ఒకరోజు ప్రొద్దుటే మేము బాలాజీ దర్శనం చేసుకొనటానికి, తిరుమలకు బస్సులో బయలుదేరాము. అక్కడ గుడి వద్దకు వెళ్ళి ముఖ్యదర్శనం టికెట్లు కొనుక్కొని వందలాది భక్తులున్న క్యూలో నిలుచున్నాము. క్యూలో కొంత ముందుకు సాగిన తరువాత తెలుసుకున్నాము, గుడిలోనికి కేమరాలను, సెల్ ఫోన్లను అనుమతించరని. మేము కేమరాలు తీసుకొని రాలేదు, కాని నావద్ద, నా సోదరి వద్ద, సెల్ ఫోన్లు ఉన్నాయి. మేము భావించాము, సెల్ ఫోన్లను బంద్ చేసి మా చేతి సంచులలో పెట్టుకుంటే సరిపోతుందని. దేవుని ఫోటోను తీసుకోలేక పోతున్నామే అన  కొంత వగచాము. మా దర్శనానికే ముప్పు వాటిల్లుతున్నదని మేము ఊహించను కూడ లేదు. క్యూ నెమ్మదిగా సాగింది. కొంత సేపటి తరువాత మాకు ఒక చెక్ పోస్ట్ ఎదురయింది. అక్కడ రక్షకదళం అందరినీ తడవి చూస్తున్నారు, పరిశోధన సాధనాలతో పరిశీలిస్తున్నారు. మాకు గుండె గుభేలుమంది. సెల్ ఫోన్ల కారణంగా మాకు దర్శనం లభించక పోతుందేమోనని. ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఆపద సమయాలలో మనస్సుకు తోచే లాగ, మనస్సు కుసుంహర, కుసుంహర, అని స్మరించటం మొదలెట్టింది. అత్యాశ్చర్యంగా మేము ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలిగాము. మాకు విమోచనం కలిగిందని మిక్కిలి సంతోషించాము. కాని మేము ఏవిధంగా శోధన సాధనాల నుండి తప్పించుకున్నామని మాకు బోధపడలేదు. ఏమైతేనేమి, రాత్రి పదిగంటలకు ముఖ్యద్వారం తెరిచారు, గుంపు ముందుకు సాగింది. అందరూ : “గోవిందా గోవిందా” అని బిగ్గరగా పలుకుతున్నారు. మేము లోపలి ద్వారం వద్గకు చేరగానే, అక్కడ మరొక చెక్ పోస్ట్ ను చూశాము, మాకు అర్థమయింది, మేము పెద్దచిక్కులో తగుల్కొన్నామని. అక్కడ తనిఖీ మిక్కిలి తీవ్రంగా జరుగుతున్నది. మాకు మార్గమే లేదు లోనికి వెళ్ళడానికి. గుంపు యొక్క త్రోపిడిని ఎన్నో గంటలు భరించి, వేడి వాతావరణం వల్ల స్వేద ఉత్పాదంతో, దర్శనం కలిగే నమ్మకం హరించి పోసాగింది. ఇక భరించే శక్తి నశించింది, నేను ఏడువ సాగాను, కుసుంహర, కుసుంహర, అని గట్టిగా పలుకసాగాను. నా సహోదరి ఇరువురు కుమార్తెలు కుసుంహర అని పలుకుతూ ఏడువ సాగారు. మేము చాల దగ్గరలో ఉన్నాము, కాని దర్శనం కలిగే అవకాశానికి బహు దూరంలో ఉన్నాము. నేను ప్రభువును ప్రార్థించాను, : “ప్రతిపదంతో నీవు మావద్ద ఉన్నావని చెప్పావు కదా! ఓ ప్రభూ! ఈ నిరోధం నుండి మమ్మల్ని కాపాడు, మాకు దర్శన భాగ్యం కలిగించు,” అని.

దర్శనం ఆలశ్యమవుతున్నదని గుంపులో అలజడి రేగింది, త్రోపుడు ప్రారంభమయింది. అదే సమయానికి, ద్వారం వద్ద ఒక సాధువుల గుంపు వచ్చింది. మాలో ఏ ఆవేశం కలిగిందో ఏమో కాని, మేము గుంపునుండి తప్పించుకొని, తనిఖీ సాధనల ప్రక్కగా పరుగెట్టి ముందు గుంపులో కలిసిపోయాము. అలజడి వల్ల మాకు అవకాశం కలిగిందే కాని, తనిఖీ సాధనాలు గట్టిగా మ్రోగసాగాయి. పరిణామం ఏమటంటే, ఆ సాధువుల గుంపును మిక్కిలి తీవ్రంగా తనిఖీ చేయటం మొదలెట్టారు. మేము చేసిన పాపకార్యం ఎంత పెద్దదో తెలియదు కాని, మేము చేసిన అపరాధం మమ్మల్ని క్షోభ పెట్టింది. మేము కొంత దూరం నుండి ఏమి జరుగుతున్నదని గమనించాము. ఆ సాధువులను తలనుండి కాలివరకు మిక్కిలి పరిశోధించారు. వారిలో ఏ దోషమూ కనిపించలేదు, అందువల్ల వారిని లోనికి అనుమతించారు. మాకెంతో మనస్సు కుదుటబడింది, మా దోషచింతన కూడ కొంత తగ్గింది. ఆవిధంగా ప్రభువు యొక్క కృపతో, బాలాజీని దర్శనం చేసుకోవాలనే మా చిరకాలపు వాంఛ నెరవేరింది.
నేను ప్రభువు పాదాల వద్ద ప్రణామాలు అర్పించి క్షమాపణ అర్థించాను. ఇప్పటికీ గుర్తుచేసుకుంటాము మేమెంత ఇబ్బంది నుండి తప్పించుకున్నామని. రోజులు గడిచే కొద్ది ప్రభువు మనకు ప్రతి అడుగునా సహాయంగా ఉన్నాడని నమ్మకం బలపడుతూ ఉంది. నేను మాతాప్రభువులను ప్రార్థించేది ఏమిటంటే, వారి పాదలనుండి నా మనస్సు చంచలం కాకూడదనే.

Blog Post # 21; 25.09.2016 - "అనంత రక్షకుడైన ప్రభువు": హరేష్ భాయ్, జవేరి

అనంత రక్షకుడైన ప్రభువుঃ హరేష్ భాయ్, జవేరి

            (Telugu translation: Sri. Haragopal Sepuri)

అది 1968వ సంవత్సరం. అప్పుడు నా వయస్సు 22 ఏండ్లు, నా తమ్ముడి వయస్సు 10 ఏండ్లు. అతడు రోజూ స్కూలుకు మా కారులో వెళ్ళే వాడు. ఒకరోజు కారు సర్వీస్ కొరకు వెళ్ళింది. కాబట్టి అతడు స్కూలునుండి టాక్సీలో వస్తుండినాడు. కొంత దూరం వచ్చిన తరువాత ఎదురు వైపు నుండి ఒక బస్సు వచ్చింది. అది టాక్సీ సమీపానికి రాగానే బస్సు డ్రైవర్ అదుపు తప్పి, బస్సు టాక్సీని నేరుగా గట్టిగా వేగంగా గుద్దింది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. అతని వెనక కూర్చున్న నా తమ్మునికి తీవ్రమైన గాయాలు తగిలాయి, తలకు బలమైన గాయాలు తగిలాయి, ఎముకలు విరిగాయి. అతణ్ణి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళే లోపులే అతడు కోమాలోకి వెళ్ళిపాయాడు. పైపెచ్చు అతనికి వాంతులు మొదలయ్యాయి. ఆ వమనం అతడి శ్వాస నాళాన్ని అడ్డగించ సాగింది. గత్యంతరం లేక డాక్టర్లు అతడి గొంతులో బొర్ర పెట్టారు, ఊపిరితిత్తులకు గాలి వెళ్ళడానికి. అతని తలలో ఎముకలు విరగడం మాత్రమే కాడు, దేహంలో కూడ పలుచోట్ల ఎముకలు విరిగాయి. ఇదీగాక చికిత్స చేస్తుండగానే అతని గుండె రెండు సార్లు ఆగిపోయింది. రెండు సార్లు డాక్లర్లు ఎలాగో గుండెకు ఊపిరి పోశారు. నా తమ్ముడి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉండిందని ఊహించవచ్చు. డాక్టర్లు అవిరామంగా శ్రమించినప్పటికీ, నా తమ్ముడు బ్రతకటం దుస్సాధ్యంగానే ఉండింది. అయితే మా అమ్మ పర్యవసానాన్ని అంగీకరించ నీరాకరించింది, థాకూర్ హరనాథుని యందు ఆమెకున్న విశ్వాసం అలాంటిది. తమ్ముని మీద శస్త్రచిత్సలు జరుగు తుండగా ఆమె ఆపరేషన్ తియేటర్ ముందు కూర్చొని నిరాహారంగా “కుసుంహర శరణం మమ,” అని నామం చేస్తూ కూర్చుంది.

మూడురోజులు ఆపరేషన్ల తరువాత ఆపరేషన్లు జరిపి నా తమ్ముణ్ణి ఐ.సి.యూ కు తరలించారు. అతడు ఎలా బ్రతికాడని డాక్లర్లే నిర్ఘాంతపోయారు, అందులోను అతడు సాధారణ జీవితం సాగించగలడా అని కూడ అభిప్రాయపడ్డారు. మా అమ్మ వాటిని అంగీకరిచలేదు, తన కుమారుడు సాధారణ నిత్యజీవితం సాగించగలడనే ధైర్యంతో ఉండింది.

ఒక సంవత్సరం తరువాత ఆమె నా తమ్ముణ్ణి సోనాముఖి శ్రీమందిరానికి తీసుకొని వెళ్ళింది. నా తమ్ముడు చావుబ్రతుకుల నుండి బయట పడటం మాత్రమే కాదు, అతడు ఇరువురు సుందరమైన పిల్లలకు తాతయ్య అయ్యాడు. ప్రభుని సామ్రాజ్యంలో భయానికి తావు ఎక్కడిది?
జయ్ శ్రీ కుసుమ్ హరనాథ్

Blog Post # 20; 18.09.2016 - "మన రక్షకదైవమయిన ప్రభువు": అర్పిత మిత్ర, కొల్కతా

మన రక్షకదైవమయిన ప్రభువు – అర్పిత మిత్ర, కొల్కతా
(అర్పిత, థాకూరు హరనాథుని ఘనభక్తుడైన శ్రీ లాల్ మోహన్ మిత్ర యొక్క మనవరాలు, మిత్ర గారిని అందరూ “లాలూ దాదాబాబు” అని పిలిచేవారు.)

[Telugu translation: Sri. Haragopal Sepuri]

థాకూరు హరనాథుని బెంగాలీ భజనను నాకు జ్ఞాపకం చేస్తున్న ఒక సంభవాన్ని సహభక్తులకు విన్నవిస్తున్నాను. “ఆమి రే తోదేర్ కాచ్ఛె నితి ఆచ్ఛీ పాఛె పాఛె, బారేక్ పాగొల్ భేబె కొరియొ స్మరణ్.” (నేను మీ దారిలో ప్రతిపదం సదా తోడుగా ఉంటున్నాను, అప్పుడప్పుడు ఈ ఉన్మాదిని జ్ఞాపకం ఉంచుకొనండి.)

తారీఖు నాకు సరిగా గుర్తు లేదు, అది 2015వ సంవత్సరం, మే నెలలో అయ్యుండాలి. నా కుమారుని 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలు ప్రకటించే దినం అది. అయితే ఆ రోజే అతడు వేరొక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో ప్రవేశం కొరకు నిర్వహింపబడుతున్న కౌన్సెలింగుకు నా భర్తతో కలిసి వెళ్ళ వలసిన రోజు. తాను బయలుదేరడానికి మునుపు పరీక్షాఫలితాలు తెలుసుకోవాలని నా కుమారుడు కుతూహలంగా ఉన్నాడు. మేము వెబ్ సైటును పరిశీలిస్తూ ఉండినాము, కాని వాళ్ళు వెళ్ళవలసిన సమయానికి పరీక్షఫలితాలు ప్రచురింపబడలేదు. మేము కొంతసేపు వేచి ఉండినాము. రైలు టైము ఆసన్నమైన దాని వల్ల నా భర్త అన్నారు, ఆ ఫలితాలు ప్రచురింపబడగానే వాటిని వాళ్ళకు ఫోను ద్వారా తెలుపమని. నా కేమయిందో తెలియదు, నేను మొండి పట్టు పట్టాను, కృషి అబ్బాయిది కదా, అతడే దానిని చూడాలి అని. చివరికి పరీక్షాఫలితాలు ప్రకటింప బడ్డాయి, నా భర్త, కుమారుడు వాటిని చూసి స్టేషనుకు వెళ్ళిపోయారు.

వారు రైలులో కూర్చున్నారనే వార్త వారినుండి ఫోనుమూలంగా వస్తుందని నేను ఎదురు చూస్తూ కూర్చున్నాను. రైలు టైమ్ అయింది, అయినా వారినుండి ఫోను పిలుపు రాలేదు. నేను మార్చి మార్చి వారిరువురికీ ఫోను చేస్తూనే ఉండినాను. ఏదో తప్పు జరిగిపోయిందని నాకు భావన కలిగింది. నేను కంగారు పడిపోయాను, నేను ప్రార్థించటం మొదలెట్టాను, ఏమి ప్రార్థించానని నాకు గుర్తులేదు. ఒక యుగంగా తోచిన ఒక గంట తరువాత నా కుమారుని నుండి ఫోను పిలుపు వచ్చింది, వారికి రైలు తప్పిపోయిందనీ, ఫరీక్షాఫలితాల కొరకు ఆలశ్యం చేసినందుకు నా భర్త ఆగ్రహంగా ఉన్నారనీ. నా మూర్ఖత్వం వల్ల నా కుమారునికి విశ్వవిద్యాలయంలో ప్రవేశం తప్పిపోయిందని నా గుండె గుభేలుమన్నది. నేను విలపించటం మొదలెట్టాను, నా మనస్సు “కర్త మా,” “కర్త బాబా” ల యొక్క మధుర నామం పలుకుతూ ఉండింది. (నా అత్తవారింట్లో థూకూర్ ను, మాతాజీను అలాగే పిలుస్తారు – కర్త అంటే కుటుంబ కర్త అని.)

దాదాపు ఒక గంట తరువాత, ఫోను మళ్ళీ పలికింది. నా కుమారుడు తెలిపాడు, వారికి తరువాతి రైలులో రెండు బెర్తులు దొరికాయనీ, రైలు కొద్దిసేపట్లో బయలుదేరుతుందనీ. నా మనస్సు భారం నేను వర్ణించలేనంతగా తొలగి పోయింది. నా ప్రార్థనలను మన్నించి కర్త బాబా, కర్త మాతా మమ్మల్ని కాపాడినందుకు మరి మరి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఏమి జరిగిందని తెలుసుకున్నాను. ఆ రోజు నా భర్త, కుమారుడు కష్టంతో ఒక టాక్సీని పట్టుకొని స్టేషన్ చేరుకున్నారు. నా భర్త వెంటనే బుక్కింగ్ ఆపీసుకు వెళ్ళి, వారికి నా కుమారుని కౌన్సెలింగ్ పత్రాన్ని చూపించి, తరువాతి రైలులో రెండు బెర్తులు కావాలని ప్రార్థించారు. వారు వెళ్ళవలసిన గమ్యానికి ఏ రైలులోను చోటు లేదని బుక్కింగ్ ఆఫీసు వారు చెప్పారు. ఆయన మిక్కిలి నిరుత్సాహ పడిపోయారు. ఏమిచేయాలో తోచలేదు. కొంత సేపటి తరువాత ఆయనలో ఏమి ప్రేరణ జరిగిందో తెలియదు, ఆయన తిరిగి బుక్కింగ్ ఆఫీసుకు వెళ్ళి అదే బుక్కింగ్ క్లర్క్ ను అడిగారు. అతడు తిర

Blog post # 19; 11.09.2016 - "భక్తుల భగవానుడు కుసుమహరనాథుడు రచయిత": మౌ దాస్, కొల్కతా

భక్తుల భగవానుడు కుసుమహరనాథుడు రచయిత : మౌ దాస్, కొల్కతా

(Telugu translation: Sri. Hara Gopal Sepuri)

నా తల్లి వైపు పితామహులు చాలకాలంగా కుసుమహరనాథ భక్తులుగా ఉండినారు. నా చిన్నతనం నుండి నా తల్లిదండ్రుల ఇంటిలో కుసుమహరనాథుల జుగళమూర్తి ఫోటోను పూజచేయటం చూశాను. ఆ పూజలను సంవత్సరంలో రెండురోజులు మాత్రమే నిర్వహించేవారు – దుర్గాపూజా సమయంలో మహాష్టమి నాడు, డిసెంబర్ 16వ తేదీన కుసుమకుమారి జన్మదినోత్సవ సందర్భంగా. నా తల్లి రోజంతా నామం వల్లిస్తూ ఉండేది.  నా చిన్న వయస్సులోనే ఆమె పరమపదించిన దానివల్ల నేను సోనాముఖి ధామానికి వెళ్ళలేక పోయాను. నా వివాహం తరువాత కూడ నా చిన్ననాటి స్మృతులు తాజాగానే ఉన్నాయి, కాని నాకు లభించనివి ఏమిటంటే కుసుమహరనాథుల జుగళ మూర్తుల ఫోటో, వారి కలకత్తా భక్తుల సాంగత్యం. సాధువుల యొక్క, అవతారాల యొక్క ఫోటోలు, మూర్తులు సులభంగా లభిస్తాయి, కాని హరనాథ భక్తలోకంలో ప్రచారం వర్జ్యం కాబట్టి మాతాప్రభువుల ఫోటో లభించటం కష్టం.

2007వ సంవత్సరంలో, నాజీవితం కుటుంబ సమస్యలతో, పరిస్థితుల కారణంగా మిక్కిని దుర్భరం అయింది. పెనుగాలిలో తగుల్కొన్న గడ్డిపోచలా నేను కొట్టుకులాడాను. ఇంకెన్నడు లేనట్లుగా ఆసమయంలో నాకు మాతాప్రభువుల జుగళ ఫోటో అవసరమయింది – దాని ముందు నిలబడి నా హృదయభరితంగా ఏడ్వాలని అనిపించింది. అకస్మాత్తుగా నాకు జ్ఞాపకానికి వచ్చింది, కుసుమకుమారి కొల్కతాకు వచ్చినపుడు పాలిట్ స్ట్రీట్ లో ఫలానా ఇంట్లో బసచేసేది అని. ఆ ఇంటిని అన్వేషించమని నా భర్తను కోరాను. ఆయన అన్నారు, ఇంత పెద్ద నగరంలో వీధిపేరు జాడతో ఇల్లు వెతకటం అసాధ్యమని. నా ఆశ నిరాశ అయిపోయింది. చివరికి, నేను కోపంతో థాకూర్ తో అన్నాను, ఇప్పటినుండి నేను నీ ఫోటోను వెతకటం ఆపుజేస్తాను. నీవే భక్తుల యొక్క భగవానుడవైతే నీ అంతట నీవే నా వద్దకు వస్తావు, అని.

ఈ అలజడిలో నేను నా పనికి ఏదోలా హాజర్ అవుతూనే ఉండినాను. ఏక్ దాలియా రోడ్డునుండి మినీబస్ పట్టుకొని ఆఫీసుకు వెళ్ళేదాన్ని. ఒకరోజు, నేను ధాకూర్ తో కోపంగా మాట్లాడిన వారం రోజుల లోపుననే, నేను బస్సు ఎక్కగానే బస్సుముందున్న గాజు పలకమీద పెద్ద అక్షరాలతో “జయ్ శ్రీకుసుమహరనాథ్” అని వ్రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. బస్సు టికెట్ ను నా పర్లులో బధ్రపరిచాను, సాయంత్రం ఇల్లు చేరుకోగానే నా భర్తతో వివరాలు చెప్పి, టికెట్ ను ఆయన కిచ్చాను. దాని వెనకున్న ఫోను నెంబరును ఉపయోగించి ఆయన బస్సు యజమాని శ్రీ అశోక్ ఘోష్ తో మాట్లాడి యుగళ ప్రభుని ఫోటోను పొందడానికి సహాయం చేస్తారా అని అడిగారు. ఆయన వద్ద లేదు, అందుకని ఆయన ఒకరి అడ్రసు, ఫోను నెంబరు ఇచ్చారు. అది శ్రీ స్వరాజ్ దత్త గారి అడ్రసు, వారి కుటుంబం తరతరాలుగా హరనాథ భక్తుల కుటుంబం. మా అదృష్ట వశాత్తు ఆయన మా ఇంటికి దగ్గరలోనే నివసిస్తున్నారు.  మేము కాలవ్యాపన చేయకుండా వెళ్ళి ఆయన్ని కలుసుకున్నాం. ఆవిధంగా నా కోరిక నెరవేరింది, నాకు యుగళ మూర్తుల ఫోటో లభించింది. అంతే కాదు ఆయన నన్ను కొల్కతా కుసుమహరనాథ భక్తులకు పరిచయం చేశారు. ఈ అనుభవం వల్ల నా విశ్వాసంలో బాగా పదిలమైన విషయం ఏమిటంటే, మాతా ప్రభువులు భక్తుని హృదయంలోని బాధను గుర్తించి అతణ్ణి/ఆమెను ఎప్పుడు ఆదుకోవాలి అన్నది బాగా ఎరుగుదురు, అని. ఆ ప్రేమమయులు తమ భక్తుల ఆవేదనకు, ప్రేమకు తప్పక ప్రతిచలిస్తారు.

Post # 18; 04.09.2016 - "నా వారిని నేనే ఎన్నుకుంటాను, మా జీవిత అనుభవం": శ్యామాలీ ఛఠర్జీ

నా వారిని నేనే ఎన్నుకుంటాను, మా జీవిత అనుభవం”

శ్యామాలీ ఛఠర్జీ, బాంకురా (ప్రభుహరనాథుని మనవడు బసంత కుమార్ యొక్క కుమార్తె)

(Telugu translation: Sri Hara Gopal Sepuri) 

అది 1976వ సంవత్సరం. నా భర్త శ్రీ తరుణ్ చఠర్జీ బెంగుళూరులో ఎన్.ఎస్.ఎన్.ఎస్.ఐ ట్రెయినింగ్ కోర్స్ కు ఎన్నుకోబడ్డారు. ఆయన వెంటనే ప్రయాణం కొరకు రైలు టికెట్ బుక్ చేశారు. అయితే రిజర్వేషన్ లో ఆయన పేరు 115 దూరంలో ఉంది, ఆయనకు సీటు నిశ్చయం కావటం మిక్కిలి దుర్లభం. ఆయన జీవితంలో ఇలాటి సదవకాశం వృథా అవుతున్నదే అని మేము మిక్కిలి నిరుత్సాహం చెందాం. ఏమైతేనేమి బరువెక్కిన మనస్సుతో ఆయన బాంకూరా నుండి ఖరగ్ పూర్ చేరుకున్నారు, అక్కడే దక్షిణానికి వెళ్ళే రైలును పట్టుకోవాలి.

మా పెళ్ళి జరిగినప్పటినుండి ఆయన థాకూరు హరనాథుని మీద, మాతా కుసుమకుమారి మీద ఎలాటి శ్రద్ధ చూపించ లేదు. వారి నామం పలుకుతూ ఉండమని చెప్పి పంపించాను. ఆయన ఖరగ్ పూర్ స్టేషన్ సకాలంలో చేరుకున్నారు, ఆందోళనతో ఏమి చేయాలో తోచక రైలు రాకకు వేచి ఉండినారు, రెండు రాత్రులు చేయవలసిన రైలు ప్రయాణం అది. రైలు వచ్చింది. ఆయన దగ్గరలో ఉన్న టి.టి.యి ని సమీపించి తనకు రిజర్వేషన్ ఉందా అని అడిగాడు. టి.టి.యి రిజర్వేషన్ అయిందనీ, ఫలానా కోచ్ కు వెళ్ళి కూర్చోమని చెప్పాడు. నా భర్త ఆనందం పట్టలేక పోయాడు, 115 మందికి దూరంలో ఉన్న తనకు ఎలా రిజర్వేషన్ దొరికిందా అని. రాత్రి భోజనం తరువాత ఆయన పక్క పరిచి పడుకున్నారు. వెంటనే నిద్ర పట్టేసింది. మధ్యరాత్రిలో ఆయనకు కల వచ్చింది. ధాకూర్ చిరునవ్వు చిందిస్తూ హేళనగా అన్నాడు, “తండ్రీ, ఏమిటి నాకు కృతజ్ఞత చెప్పవా?” నా భర్త ఉళిక్కిపడి నిద్ర లేచారు, ప్రభువుకు మరి మరి ప్రణామాలు అర్పిస్తూ క్షమాపణ చెప్పుకున్నారు. అప్పటినుండి ఆయనలో పరివర్తన కలిగింది. ఇప్పుడు నా కంటె ఆయనకే మాతాప్రభువులందు భక్తి అధికం. ప్రభువు చెప్పాడు కదా తన వారిని తానే ఎన్నుకుంటానని. మన మనస్సులు మాతాప్రభువుల పాదాలనుండి వైదొలగకుండును గాక! అని ప్రార్థిస్తూ, జయ కుసుమహరనాథ్.

Post # 17; 28.08.2016 - "నిత్యోద్ధారక ప్రభువు రచయిత": వి.సుబ్బారావు, విశాఖపట్నం

    నిత్యోద్ధారక ప్రభువు రచయిత: వి.సుబ్బారావు, విశాఖపట్నం

(Telugu translation: Sri. Haragopal Sepuri)

2015వ సంవత్సరం, నవంబరు మాసం, 22వ తేదీన నేను నా బంధువు యొక్క వివాహంలో పాల్గొనటానికి హైద్రాబాదు వెళ్ళి ఉండినాను. నేను నా దాయాది కుమారుని ఇంట్లో బసచేశాను. ఆయన తన భార్యతో కలిసి ఒక మూలనున్న ప్లాటులో ఉన్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఆయన మేనల్లుడి వివాహం మరుసటి రోజు నిర్వహించడానికి నిర్ణయింపబడి ఉండింది. నేను వెళ్ళిన రోజునే నేను నా దాయాది కుమారుడు, అతని భార్యతో కలిసి హైదరాబాదులోని మా చుట్లాలను చూడటానికి వెళ్ళి సాయంత్రం 7.30 గంటలకు ఇల్లు చేరుకున్నాం. మేము ముగ్గురమూ 70 ఏండ్లకు పైబడిన వారం. “హరనాథుని దివ్యమహిమ” అనే నా పుస్తకం నుండి ప్రభువును గురించి రాత్రి 11 గంటల వరకు చర్చించుకున్నాం. నా దాయాది కుమారుడు, అతని భార్య వారి పడకగదిలో విశ్రమించారు, నేను వసతిగదిలో విశ్రమించాను.
రాత్రి 2.30 గంటలకు నా దాయాది కుమారుని భార్య “దొంగ, దొంగ,” అని కేకలు పెట్టటం వినిపించింది. నేనూ, నా దాయాది కుమారుడు గబ గాబా గదులనుండి పరుగెత్తుకొని వచ్చాం. అంతలో దొంగలు పారిపోయారు. అయితే మాకు కనిపించిన స్థితి దారుణంగా ఉండింది. వారి పడకగదిలోని ఒక కిటికీ ఊచలు ఊడబెరికి ఉన్నాయి, ముఖద్వారం బారుగా తెరువబడి ఉంది. విలువైన వస్తువులున్న వారి స్టీలు బీరువా తాళంచెవుల గుత్తి మెట్లమీద పడి ఉంది. ఇంటి ముందు వెనుక వాకిళ్ళ తాళంచెవులు కూడ ఆ గుత్తిలోనే ఉన్నాయి. నా దాయాది కుమారుని మొబైల్ హాలులోని దివాన్ మీద పడి ఉంది. దీవాన్ మీదున్న పొడవాటి గుండ్రని దిండు నా దాయాది పుత్రుని భార్య వైపు పడి ఉంది. బహుశ ఆమెకు మెలకువ కలిగితే, ఆమె గొంతును ఆ దిండుతో నొక్కి ఆమెకు ఊపిరి సలుపకుండా చేయటానికే అయ్యుంటుంది. ఆ చోరులు చాలసేపు ఇంట్లోనే ఉండి తమ పనిని క్రమంగా సాగిస్తూ ఉండినారు.
మొదట పడకగదిలోని కిటికీలో బొర్ర చేసి (ఊచలు పెరికి), తరువాత మంచం ప్రక్కన స్టూలు మీదన్న తాళంచేవుల గుత్తిని తీసుకున్నారు (బహుశ ఒక నిడువు కర్రకు ఆయస్కాంతాన్ని బిగించి, ఆ తాళపు చెవుల గుత్తిని లాగుకొని ఉంటారు). తరువాత ముందు వెనక వాకిళ్ళను తెరిచి ఉంటారు, తరువాత నా దాయాది పుత్రుని మొబైల్ ఫోనును తీసుకొని, దివాన్ మీదున్న దిండును పడకగదిలోని మంచం వద్దకు తీసుకొని వచ్చి ఉంటారు, అన్నీ సక్రమంగానే జరిగాయి, కాని వారు పారిపోయారు. ఇంట్లో మూడవ మనిషి (నేను) ఉన్నానని బహుశ వారికి తెలిసి ఉండదు. అయితే వారి పథకం సాధకంగా సాగింది కదా, మరి నా దాయాది పుత్రుని భార్య నిద్రలేవగానే వారు ఎందుకు పారిపోయారు అన్నది అంతు దొరకలేదు. నా దాయాది పుత్రుని కుమారుడు హనుమంతుని పరమభక్తుడు. తరువాత ఆయన నాతో అన్నాడు, “మీ హరనాథుడు మీతో కలిసి మా ఇంటికి వచ్చాడు, మా సొత్తును అపహరింపబడకుండా కాపాడిన వాడు అతడే, మా ప్రాణాలను కూడ కాపాడాడు,” అని. ఇతర భక్తులకూ ఈ సంభవాన్ని తెలియజేయండి అని ఆయన నన్ను అర్థించాడు. దానిని నేను సోదరుడు తిలక్ నిర్వహిస్తున్న “కుసుంహరలీలాస్.కాం” వెబ్ సైట్ ద్వారా బహిరంగం చేస్తున్నాను.
ఈ సంభవం జరిగిన మర్నాడు నేను దీనిని చిరంజీవులు మాధురి, గీత సహోదరీలతో చెప్పాను. దీనిని గురించి నా మనస్సులో కలిగిన భావం ఏమిటంటే, “వాళ్ళు వధించటానికి వచ్చారు, కాని మాకు భగవదనుభవాన్ని విధించి వెళ్ళి పోయారు,” అని. “ప్రభువు, అతని నామం వర్ధిల్లు గాక! ప్రభువు సదా మన చెంతనే ఉండును గాక!” అని ఆయన్ని ప్రార్థిస్తూ, భక్తులందరికీ ప్రణామములు.
* * * * * * *

బ్లాగ్ పోస్ట్ 27; 27.12.2016 - "సదా నాకు రక్షకుడుగా ఉన్న బాబా రచయిత": ఆర్.జి.ప్రకాష్, బెంగలూరు

“సదా నాకు రక్షకుడుగా ఉన్న బాబా రచయిత”: ఆర్.జి.ప్రకాష్, బెంగలూరు

ఎన్నో మార్లు నా జీవితంలో బాబా యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని అనుభవించిన భాగ్యం నాకు కలిగింది. ఇవి నాకు అత్యంత ఆనందాన్ని మాత్రమే కాదు, అన్ని ప్రతిబంధకాలను ఎదుర్కొనే విశ్వాసాన్ని కలిగించాయి. ప్రభువు సదా నా చెంతనే ప్రతి అడుగునా ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఈ అనుభవాలను వ్రాత మూలంగా తెలుపడానికి నాకు సాధ్యం కాదు. అయినా ఇటీవలి ఒక చిన్ని సంభావాన్ని తెలుపుకుంటున్నాను.

2016వ సంవత్సరం అక్టోబర్ లో సోనాముఖిలో జరిగిన నామసప్తాహం నుండి తిరిగి వచ్చిన తరువాత నాకు అస్వస్థత  కలిగింది.  కిషోర్ ను పిలిపించాను. అతడు నన్ను ఆసుపత్రికి తనిఖీ చేయించుకొనడానికి తీసుక వెళ్ళాడు. ఎక్స్రే రిపోర్టులు చూసి నాకు న్యుమోనియా వ్యాధి సంక్రమించిందని డాక్టర్లు నిర్ణయించారు. నన్ను ఐ.సి.యు లో పెట్టారు. నాకు కొంత గుణం కనిపించగానే మూడు రోజుల తరువాత నన్ను జెనరెల్ వార్డుకు తరలించారు. మరి రెండు రోజుల తరువాత నన్ను ఇంటికి పంపించారు. రెండు రోజులు నాకు బాగానే ఉండింది, సాధారణ ఆహారం ఆరగించ సాగాను, ఇంట్లో మెల్లగా తిరుగ గలిగాను. అయితే ఆ తరువాత నాకు మిక్కిలి శరీర కష్టానుభవం కలిగింది, ఒక రాత్రి పూర్తిగా నిద్ర పోలేక పోయాను. మరుసటి రోజు ఉదయం కిషోర్ నన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు. నా ఎక్స్రేను చూసి డాక్టర్లు విస్తు పోయారు, నా ఊపిరితిత్తులలో గళ్ళ నిండుకొని ఉంది. నా పరిస్థితిని చూసి అమెరికాలో ఉన్న నా కుమారుణ్ణి వెంటనే పిలిపించమన్నారు. అతడు విమానం దొరకగానే వచ్చి చేరుకున్నాడు. నా పరిస్థతి మిక్కిలి ప్రమాదస్థితిలో ఉందనీ, అందుకు వయస్సు కూడ కారణమనీ, చికిత్స అధిక వ్యయంతో కూడుకున్నదనీ, నేను బ్రతకడానికి వారు హామీ ఇవ్వలేమనీ చెప్పారు. ఆలోచించి అతని నిర్ణయమేమిటో తెలుపమన్నారు. నా కుమారుడు మాకు భగవంతునియందు నమ్మకం ఉందని తెలుపుతూ వెంటనే చికిత్సను ప్రారంభించమన్నాడు. ఐ.సి.యులో పదిహేను రోజులు చికిత్స జరిగింది. నా స్థితి క్రమంగా తేరుకుంది. ఒకరోజు ఐ.సి.యులో నేను మంచం నుండి దిగి, కుర్చీలో కూర్చో దలిచాను. నా ప్రక్కనే ఉన్న మగనర్సును సహాయమడిగాను. అతడు నన్ను మెల్లగా కూర్చోబెట్టాడు. ఒక గంట కాలం నేను కూర్చీలో కూర్చొని తిరిగి పడకలోకి వెళ్ళ దలిచాను. అప్పుడు మగనర్స్ అక్కడు లేడు. ఇద్దరు ఆడనర్సుల సహాయంతో, ప్రక్కనే ఉన్న వారి బుజాల మీద చేతులను ఊని లేవబోయాను. నా కాళ్ళలో బలం లేదు, అవి తడబడ్డాయి. అందువల్ల నేను నర్సుల మీద వాలిపోయాను. మేము ముగ్గురం క్రింద పడిపోయే పరిస్థితి. ఆ సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఒక సీనియర్ ఆడ నర్సు సాక్షాత్కరించింది, నా రెండు కాళ్ళను ఎత్తిపట్టుకొని ఒక్క ఊపుతో నన్ను పడక మీద పడుకోబెట్టింది. నేను కొంత సర్దుకొని ఆమెకు కృతజ్ఞత తెలుపుడానికి తిరిగి చూశాను, కాని ఆమె కనిపించలేదు. నేను ఆ ఇరువురు నర్సులను ఆమె ఎవరని అడిగాను, ఆమె ఎవరో వారికి తెలియదని వారు చెప్పారు. తరువాత నేను ఆసుపత్రి సిబ్బందిని ఆమెను గురించి అడిగాను, ఆ నర్సు ఎవరో వారూ గుర్తించలేక పోయారు. బాబానే ఒక స్త్రీ రూపంలో నాకు సహాయ పడడానికి వచ్చాడని నాకు ఇప్పడు నమ్మకం కలిగింది. మన జీవితంలో ఆయన మన చెంతనే సదా ఉన్నాడు, మనమే ఆయన్ని తరచు గుర్తించ లేకుండా పోతున్నాము. ఆయన యొక్క ప్రేమ కరుణలతో నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. బలహీనత కొరకు ప్రోటీన్లను, విటమినులను తీసుకొంటున్నాను, ఔషధాలు ఇప్పుడు నాకు అవసరం లేదు.